📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu News : Law : చట్టం అందరికి సమానమేనా?

Author Icon By Sudha
Updated: October 17, 2025 • 3:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

‘దొరతనంబునందు దొంగతనంబునందు భాగ్య వంతునికి ఏదైనా బాధలేదు’ అన్నారు పెద్ద లు. ఏ సందర్భంలో ఏ అనుభవంతో ఎవరిని ఉద్దేశించి ఈ లోకోక్తి పుట్టిందో కానీ ప్రస్తుత పరిస్థి తులను పరిశీలిస్తే వారు చెప్పింది అక్షరాలా నిజమేనని పిస్తున్నది. కానీ మన రాజ్యాంగ నిర్మాతలు ఇవేమీ దృష్టి లో పెట్టుకోకుండా కుల, మత, వర్గ, లింగ బేధాలు లేకుం డా అందరికి సమానంగా వర్తించే విధంగా శాసనాలతో రాజ్యాంగాన్ని రూపొందించారు. అవి నిష్పక్షపాతంగా అమలు చేస్తారని భావించారు. కానీ దురదృష్టవశాత్తు అమలు చేయాల్సిన కొందరు అధికారులు రాజకీయ ఒత్తిడిలకు లొంగో లేక దక్షిణ ప్రలోభంలో పడి చట్టాన్ని (Law) తమకు అనుకూలంగా మలుచుకుంటారని నాటి రాజ్యాం గ నిర్మాతలు ఊహించలేకపోయారు. ఫలితంగా వంద లాది కరుడుగట్టిన నేరస్తులు చట్టం (Law) నుంచి తప్పించుకోగలుగుతున్నారు. అన్నింటికంటే మించి ప్రజలను వం చించి కోట్లాది రూపాయలు దోచుకుంటున్న వైట్కాలర్ నేరస్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటపడగలుగుతున్నారు. సమర్థవంతంగా దర్యాప్తు చేసి పటిష్టమైన రికార్డులు తయారు చేసి అవసరమైన సాక్ష్యాలను సేకరిం చి న్యాయస్థానాల ముందు నిలబెట్టి రుజువు చేయడంలో సంబంధిత అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారు. కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వల్ల దర్యాప్తు సక్రమంగా జరగకపోతే మరికొన్ని సందర్భాల్లో ఆశ్చర్యకరంగా అధికారులే స్వయంగా కేసులు వీగిపోయే విధంగా రికార్డులు తయారు చేస్తున్నారు. అందుకు వారికి ఉన్న కారణాలు వారికి ఉన్నాయి. ఇంకొన్ని సందర్భాల్లో అధికారులుసకల అవస్థలు పడి కోర్టుల ముందు రుజువులు సర్వం సిద్ధం చేసినప్పుడు కొందరు పాలకులే ఏకంగా కేసులకు మోకా లొడ్డుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో సమర్థవంతంగా దర్యాప్తులు చేసే అధికారుల్లో నిస్పృహ నిరాశా పెంచుతు న్నారు. దీనికితోడు ఏనాడో తయారు చేసిన చట్టాలు నిబంధనల్లో ఉన్న లొసుగులను నేరస్తులు ఉపయోగించుకోగలుగుతున్నారు. అందుకే అప్పటి పరిస్థితులకు అను గుణంగా ఆనాటి బ్రిటిష్ ప్రభువులు తయారు చేసిన సిఆర్పిసి, ఐపిసి నిబంధనలను కాలాగుణంగా సవరించాలనే పోలీసుల వాదన కూడా సమంజసమే. ఇటీవల మూడు చట్టాలను కూడా కేంద్రప్రభుత్వం సవరించింది. అయితే ఉన్న నిబంధనలను, చట్టాలను ఏమేరకు నిష్పక్ష పాతంగా అమలు చేస్తున్నారనేదే ప్రశ్న. ధనిక, పేదతేడా లేకుండా ఎంతవరకు చిత్తశుద్దితో వ్యవహరించగలుగుతు న్నారనేదే ముఖ్యం. ఏ అండా లేని నిరుపేదలు పోలీసు స్టేషన్కు వస్తే ఎలా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చర్చించా ల్సిన అవసరం లేదు. కిందిస్థాయి పోలీసు ఉద్యోగుల్లో ప్రవర్తనలో మార్పులు తీసుకువచ్చేందుకు గత రెండు, మూడు దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంతమేరకు ఫలితాలు కన్పిస్తున్నా ఆశించిన స్థాయిలో ఇవి జరగడంలేదనే చెప్పొచ్చు. ఇందుకు కిందిస్థాయి అధికారులను నియమించేకంటే ఉన్నతస్థాయిలో ఉన్న అధికారుల్లో కొందరు రాజకీయ నాయకులు ఒత్తిడికి తలొగ్గడం వల్లనే ఈ పరిస్థితులు దాపురిస్తున్నాయనే ఆరోపణలను తోసిపుచ్చలేం. ప్రధానంగా పోలీసుల్లో కొందరు ఉన్నతాధి కారులు రాజకీయనేతలతో మమేకం కావడం వల్లనే కింది స్థాయి ఉద్యోగులు పెదవి విప్పలేకపోతున్నారు. దేశవ్యా ప్తంగా కానీ, తెలుగురాష్ట్రాల్లో కానీ ఈ బోగస్ ఫైనాన్స్ కంపెనీలు పెట్టి కోట్లాదిమంది అమాయకుల కష్టార్జితాన్ని కోట్లల్లో కొల్లగొట్టి బోర్డులు తిప్పేస్తేజీవితకాలంపాటు సంపాదించుకున్న డబ్బుపోగొట్టుకొని న్యాయం చేసేవారు లేక బాధితుల వేదన అరణ్యరోదనగా మారుతు న్నది. కొం దరు బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘట నలు తరచుగా చోటుచేసు కుంటున్నాయి. ఇలా మోసపోయిన వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే అంశం. తెలుగురాష్ట్రాల్లో గత దశా బ్దంలో పరిశీలిస్తే అధికారికంగా, అనధి కారికంగా లెక్కలు చూసినా దాదాపు ఇరవై వేలకోట్లకుపైగా బోగస్ ఫైనాన్స్ కంపెనీలు, చిట్ఫండ్ కంపెనీలు ప్రజలను మోసం చేసి దోచుకున్నట్లు అంచనా. ఇందులో కొన్నింటిలో రికవరీ ఏదో కొద్దిశాతం ఉన్నా ఇలా నిలువునా ప్రజలను మోసం చేసిన దగాకోర్లపై నిర్దిష మైన చర్యలు తీసుకున్న దాఖలా లు లేవు. మరొకపక్క మోసపోయిన వారు బాధితుల సంఘాలంటూ ఏర్పడినిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు, తదితర ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇంకొక పక్క ఏదోరకంగా డబ్బుసంపాదించగలిగితే తమనుఎవరు ఏమీ చేయలేరనే భావన మోసగాళ్లల్లో పెరిగిపోతున్నది. ఈ విషయంలో కొందరు బాధితులు పోలీసు స్టేషన్కు వెళ్లితే న్యాయం సంగతి ఎలాఉన్నా అసలుకేసులు నమో దు చేసుకోవడానికి అధికారులు ఇష్టపడడంలేదు. మమ్మల్ని అడిగి ఇచ్చారా? ఇచ్చేటప్పుడు తెలివిలేదా? లాభం వస్తే మా వద్దకు వచ్చేవారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించి మళ్లీ పోలీసు స్టేషన్కు రాకుండా చేసి పంపుతున్నారు. అంతేకాదు ఇది సివిల్ తగాదా అని జోక్యం చేసుకోవడా నికి వీలులేదని, న్యాయస్థానాలకు వెళ్లి వసూలు చేసుకో మని సలహాలు ఇస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి ఫిర్యాదులన్నీ నమోదు చేస్తే పోలీసులు వేరే పనిచేయలేరనే వాదనను తోసిపుచ్చలేం. పెరిగిన నేరాలతో పాటు పోలీసులకు బాధ్యత కూడా విపరీతంగా పెరిగిపోయిందనడంలో సందేహంలేదు. అయితే ఇలాంటిమోసాలు పెద్దఎత్తున జరగడం ప్రభుత్వ ప్రతిష్టను, పోలీసువ్యవస్థపై ప్రజలకు ఉన్న గౌరవాలను తగ్గిస్తున్నది. పాలకుల పట్ల వ్యతిరేకతను ఏర్పరుస్తున్నది. పాలకులు ఆ కోణంలో ఆలోచించాలి. ఈ దగా, భారీ మోసాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also: Chhattisgarh: 200 మంది లొంగుబాటుతో మావోయిస్టుకు భారీ దెబ్బ

: Law Breaking News Equality Before Law Human Rights Justice latest news legal system Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.