తెలంగాణ (Telangana) లో మావోయిస్టుల (Maoist) కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేస్తూ కీలక పాత్ర పోషించిన ఆజాద్ అలియాస్ సాంబయ్య (Sambayya) పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. ఆయన వెంట మరికొంతమంది కేడర్ కూడా ఆయుధాలు వదిలి, జనజీవన స్రవంతిలో కలిసినట్లు తెలుస్తోంది.
Read Also: Nellikanti Sathyam: చేనేత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) మావోయిస్టులకు ఓ పిలుపునిచ్చారు. చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పౌర సమాజంలో కలిసిపోవాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలోనే ఆజాద్ లొంగుబాటు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన సాంబయ్య, 1995లో అజ్ఞాతంలోకి వెళ్లారు. గతంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు. ఆయన తలపై ప్రభుత్వం రూ. 20 లక్షల రివార్డును ప్రకటించింది. (Maoist) ఆజాద్ లొంగుబాటుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: