📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Politics : రాజకీయ అక్కసుతోనే తెలంగాణకు అన్యాయం – మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్

Author Icon By Shravan
Updated: August 14, 2025 • 1:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ Politics : పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తున్న తెలంగాణకు రాజకీయ అక్కసుతోనే కేంద్రం అన్యాయం చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Duddilla Sridhar Babu) ఆవేదన వ్యక్తం చేశారు. సెమీకండక్టర్ ప్రాజెక్టు కేటాయింపులో వివక్ష చూపించి, రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమను చూపిస్తుందంటూ ఓ ప్రకటనలో మండిపడ్డారు. ప్రపంచస్థాయి అధునాతన సిస్టమ్ అండ్ ప్యాకేజింగ్ ఫెసిలిటీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది.

మహేశ్వరంలో 10 ఎకరాల భూమి కేటాయించాం

అన్ని రకాల సబ్సిడీలకు ఆమోదం తెలిపాం. రికార్డు సమయంలో అన్ని అనుమతులిచ్చాం. ఇండియా సెమీకండక్టర్ మిషన్ తుది ఆమోదం లభిస్తే పనులు మొదలు పెట్టేందుకు సదరు ఇన్వెస్టర్ సిద్ధంగా ఉన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు అని విమర్శించారు. అన్ని రకాలుగా అర్హతలున్నా తెలంగాణను విస్మరించి కనీస సంసిద్ధత లేని ఏపీకి ప్రాజెక్టును (Project) ఎలా కేటాయిస్తారని మంత్రి శ్రీధర్ బాబు కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇలాంటి రాజకీయ ప్రేరేపిత నిర్ణయాలు దేశ పారిశ్రామి కాభివృద్ధికి మంచిది కాదు. అందుకే ఈ నిర్ణయాన్ని మరోసారి పునఃపరిశీలించాల్సిన అవసరముంది.

వాస్తవ పరిస్థితులను పరిగణలోనికి తీసుకుని తెలంగాణకు మేలు చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోక్యం చేసుకుని తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. న్యాయం జరిగేలా చొరవ చూపాలి. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన తెలంగాణ బీజేపీ ఎంపీలు చోద్యం చూస్తున్నారు. ఇప్పటికీ స్పందిం చకపోతే తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/be-vigilant-24-hours-a-day-at-projects/telangana/530159/

Breaking News in Telugu Latest News in Telugu Minister Sridhar Babu political bias political discrimination state issues Telangana injustice Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.