ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఆధార్ కార్డులో తప్పులు సరి చేయండి
హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. లబ్దిదారులకు నగదు చెల్లింపు అంశంలో అవకతవకలు జరగకుండా చూడటం కోసం ఆధార్ ఆధారిత పేమెంట్స్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ విధానంలో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా మంది లబ్ధిదారులు వివరాలు.. వారి ఆధార్ కార్డ్ వివరాలతో సరిపోలడం లేదు. దీంతో పేమెంట్స్ ఆగిపోయి.. లబ్ధిదారులు ఆందోళన పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ళ పథకం (Indiramma Housing Scheme) అమలును.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.
సొంతంగా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి
సొంతంగా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇంటిని నిర్మించుకునేందుకు ఆర్థికంగా సాయం చేయడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. తొలి విడతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. ప్రస్తుతం ఇవన్ని నిర్మాణ దశల్లో ఉన్నాయి. కొన్ని పూర్తి కావొచ్చాయి కూడా. ఇక ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Update) నిర్మాణం కోసం రాష్ట్ర సర్కార్ రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కీలక అలర్ట్ జారీ చేసింది. మరీ ముఖ్యంగా ఆధార్ కార్డుల్లో తప్పులున్న వారి కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Indiramma Update
ఆధారిత చెల్లింపు వ్యవస్థ ద్వారా చేపట్టాలని
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు నగదు చెల్లింపుల కోసం రేవంత్ (Revanth) సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. లబ్దిదారులకు సంబంధించి నగదు చెల్లింపులను ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ ద్వారా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీని వల్ల పథకం అమలులో పారదర్శ కతతో పాటు వేగంగా చెల్లింపులు చేసేందుకు వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇప్పుడు ఇదే పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది. ఆధార్ ఆధారిత చెల్లింపుల నేపథ్యంలో చాలా వరకు లబ్ధిదారుల వివరాలు.. వారి ఆధార్ కార్డ్లో ఉన్న వివరాలతో సరిపోలడం లేదని తెలుస్తోంది.
మొత్తం లబ్దిదారుల్లో సుమారు 30 శాతంమంది ఇదే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఆధార్ (Adhar) వివరాలు సరిపోకపోవడం వల్ల.. పేమెంట్స్ ఆగిపోతాయని అధికారులు చెప్పుకొస్తున్నారు. దీంతో లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం వారికి ఊరట కలిగించే ప్రకటన చేసింది. లబ్దిదారుల ఆధార్ వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే వెంటనే సరిదిద్దాలని హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లనిర్మాణం పనులు వేగం పుంజుకుం టున్నాయి. ఇప్పటికే కొందరు ఇంటి నిర్మాణం పూర్తి చేయగా.. మరికొన్ని ఇళ్ల విషయానికి వస్తే బేస్మెంట్, గోడలు, స్లాబ్ లెవల్లో నిర్మాణాలు ఉన్నాయి. త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు కోరుతున్నారు. ప్రతి సోమవారం లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నారు. ఈక్రమంలో అధికారులు ఇంటి నిర్మాణం త్వరగా పూర్తయ్యేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
Q1: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రభుత్వం ఎందుకు ఆధార్ ఆధారిత చెల్లింపులు ప్రారంభించింది?
A1: నగదు చెల్లింపులలో అవకతవకలు జరగకుండా, పారదర్శకంగా మరియు వేగంగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది.
Q6: ప్రతి ఇల్లు కోసం ప్రభుత్వం ఎంత ఆర్థిక సహాయం ఇస్తోంది?
A6: ప్రభుత్వం ప్రతి ఇల్లు నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది.
Read hindi news:hindi.vaartha.com
Read Also: