📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Indiramma Sarees : తెలంగాణ మహిళలకు బిగ్ షాక్‌.. ఇందిరమ్మ చీరల పంపిణీకి అకస్మాత్తుగా బ్రేక్!…

Author Icon By Sai Kiran
Updated: November 30, 2025 • 1:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Indiramma Sarees : తెలంగాణ మహిళలకు కాంగ్రెస్‌ ప్రభుత్వంతో మరోసారి నిరాశే ఎదురైంది. రెండేళ్లుగా భారీ ఆశలతో ఎదురుచూస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీకి అడ్డంకి ఏర్పడింది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో చీరల పంపిణీని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలో బతుకమ్మ సందర్భంగా మహిళలకు రంగురంగుల చీరలు ఇచ్చే ఆనవాయితీ మొదలైంది. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒకటి కాదు రెండు చీరలు ఇస్తామని ప్రకటించినా ఆ హామీ పూర్తిగా అమలుకాలేదు.

రెండేళ్ల తర్వాత ఇటీవల బతుకమ్మ చీరలకు ‘ఇందిరమ్మ’ అనే పేరు పెట్టి నవంబర్‌లో పంపిణీ మొదలు పెట్టింది ప్రభుత్వం. కానీ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో హడావుడిగా (Indiramma Sarees) ప్రారంభించిన ఈ పంపిణీ క్రమంగా గందరగోళంగా మారింది. చివరకు ఎన్నికల కోడ్ కారణంగా పూర్తిగా నిలిపివేయాల్సి వచ్చింది.

Read also: Maoist Bandh: ఎన్‌కౌంటర్ తరువాత మావోయిస్టుల హెచ్చరిక

ప్రభుత్వం మొత్తం కోటి చీరలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు కేవలం 44 లక్షల చీరలే పంపిణీ అయ్యాయి. మిగిలిన చీరల పంపిణీపై ఇప్పుడు అనిశ్చితి నెలకొంది.

ఇందిరమ్మ చీరలపై మహిళల నుంచి పెద్దగా స్పందన కనిపించడంలేదు. అందరికీ ఒకే రంగు చీరలు ఇవ్వడం, స్కూల్‌ యూనిఫామ్‌ మాదిరి ఉండడం వల్ల చాలామంది తీసుకోవడానికి మొహమాటం పడుతున్నారు. అంతేకాదు, చీరల రంగుల్లో కాంగ్రెస్‌ పార్టీ జెండా వర్ణాలు కనిపించడంతో రాజకీయ కనుకలుగా భావిస్తూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పండుగ సమయంలో కాకుండా, ఎన్నికల సమీపంలో మాత్రమే చీరలు పంపిణీ చేయడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేవలం ఓట్ల కోసమే ఈ పథకాన్ని అమలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల అనంతరం ఇందిరమ్మ చీరల పంపిణీ తిరిగి కొనసాగుతుందో లేదో అన్నదానిపై స్పష్టత లేకపోవడం మరో చర్చకు దారితీస్తోంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

batukamma sarees telangana Breaking News in Telugu Congress Government Telangana Google News in Telugu indiramma latest news indiramma saree distribution indiramma sarees Latest News in Telugu saree distribution stopped Telangana Government Schemes telangana indiramma sarees telangana local body elections Telugu News women welfare schemes telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.