Indiramma Kutumba Jeevana Bheema: కుటుంబానికి ఆధారమైన వ్యక్తి అకస్మాత్తుగా దూరమైతే, ఆ కుటుంబం రోడ్డున పడకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సాహసోపేతమైన పథకానికి శ్రీకారం చుట్టింది.ఆదాయం తెచ్చే వ్యక్తి అకస్మాత్తుగా లేకపోతే.. బాధ ఒక వైపు, భవిష్యత్తుపై భయం మరో వైపు కుటుంబాన్ని వెంటాడుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఎవరూ రోడ్డున పడకూడదన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. “ఇందిరమ్మ కుటుంబ జీవన భీమా” పేరుతో వినూత్న పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.
Read Also: Telangana Budget Highlights: బడ్జెట్‌లో కొత్త పథకం.. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
పథకం ముఖ్య ఉద్దేశాలు
- ఆర్థిక భరోసా: కుటుంబ యజమాని లేదా సంపాదించే వ్యక్తి మరణించినప్పుడు, ఆ కుటుంబం ఆర్థికంగా కుప్పకూలిపోకుండా రూ. 5 లక్షల భీమా సొమ్మును ప్రభుత్వం అందిస్తుంది.
- లబ్ధిదారుల పరిధి: రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1 కోటి 15 లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా రక్షణ లభించనుంది.
- అమలు తేదీ: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2026 జూన్ 2 నుంచి ఈ పథకం అధికారికంగా అమలులోకి రానుంది.
కుటుంబానికి అండగా నిలిచే వ్యక్తి లేకపోయినా… ఆ ఇంటి భవిష్యత్తు చీకటిలో కలిసిపోకుండా కాపాడటమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: