📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అలసత్వం వద్దు-మంత్రి తుమ్మల

Author Icon By Sai Kiran
Updated: August 21, 2025 • 7:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Indlu) నిర్మాణం విషయంలో అలసత్వం లేకుండా చూడాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సూచిం చారు. బుధవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నగరంలో నిర్వహించారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Indiramma Indlu) అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇంఛార్జ్లు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా అభివృద్ధి అజెండాగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఇందిరమ్మ ఇళ్లు రహదారులు సాగునీటి ప్రాజెక్టులు విద్య వైద్య రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతి పై చర్చించారు.


సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైజింగ్ తెలంగాణ లక్ష్యంగా సాగుతున్న పాలనలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్లు నిబద్ధతతో నిజాయితీగా పని చేయాలని మంత్రి తుమ్మల దిశానిర్దేశం చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై రైతు భరోసా రైతు రుణమాఫి పై బిఆర్ఎస్ బిజెపి నేతలు చేస్తున్న అసత్య ప్రచారం క్షేత్ర స్థాయిలో తిప్పికొట్టాలని మంత్రి తుమ్మల తెలిపారు.

సన్నబియ్యం పథకం మహిళలకు ఉచిత ఆర్టీసి బస్సు ప్రయాణం రైతు భరోసా


సన్నబియ్యం పథకం మహిళలకు ఉచిత ఆర్టీసి బస్సు ప్రయాణం రైతు భరోసా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా ప్రభుత్వంపై ప్రజానీకం విశ్వాసంగా ఉన్నారని మంత్రి తుమ్మల తెలిపారు. పెండింగ్ సాగునీటి ప్రాజెక్ట్లు రహదారులు నిర్మాణంలో ఫోకస్ పెట్టాలని అన్ని వర్గాల వారికి పార్టీలకు అతీతంగా ప్రజా పాలనలో పారదర్శకంగా ఉండాలని మంత్రి తుమ్మల తెలిపారు.

పత్తి వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ సాగు వైపు రైతాంగం ఆసక్తి కలిగేలా ప్రోత్సహించాలని అభివృద్ధిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా తనదైన ముద్ర వేయాలని మంత్రి తుమ్మల అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల తో పాటు పార్టీ బలోపేతం పై ప్రధాన దృష్టి పెట్టాలని, గత ప్రభుత్వ అరాచక అవినీతి కోటలు బద్దలు కొట్టి కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం చేయాలని బిజెపి, బిఆర్ఎస్ రెండు పార్టీలు ఎలా తెలంగాణ అభివృద్ధికి అడ్డు పడుతున్నారనే విషయాలపై పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి తుమ్మల దిశా నిర్దేశం చేశారు.

BJP Telangana politics Breaking News in Telugu BRS vs Congress Telangana Congress party Telangana farmers loan waiver Telangana free bus travel women Telangana Hyderabad political news Indiramma houses construction Indiramma Indlu scheme Telangana Karimnagar district development Latest Telugu News Revanth Reddy government Telangana Congress ministers Telangana Irrigation Projects Telangana rice scheme Telangana welfare schemes Telugu News Tummala Nageswara Rao news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.