हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Indiramma illu News : ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పెద్ద ఊరటలబ్ధిదారులకు శుభవార్త!

Sai Kiran
Indiramma illu News : ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పెద్ద ఊరటలబ్ధిదారులకు శుభవార్త!

ఇందిరమ్మ ఇళ్లు : లబ్ధిదారులకు గుడ్ న్యూస్ – నిబంధనలు సడలించిన తెలంగాణ ప్రభుత్వం!

Indiramma illu News : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ పేదవాడికి సొంత ఇంటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు 9,456 ఇళ్లు మంజూరు చేయగా, చాలా ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇక, లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

నిబంధనల సడలింపు – లబ్ధిదారులకు ఊరట

ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 400 నుండి 600 చదరపు అడుగుల విస్తీర్ణం తప్పనిసరిగా ఉండాలని షరతు ఉండేది. ఈ కారణంగా కొంతమంది లబ్ధిదారులు నిర్మాణ అనుమతులు పొందలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Read Also: AP: ఈ నెల 14 నుంచి ‘సదరం’ స్లాట్ బుకింగ్

ఇకపై ఆ నిబంధనలను ప్రభుత్వం సడలించింది. ఇప్పుడు కనీసం 400 చదరపు అడుగులు (44.4 చదరపు గజాలు) స్థలం ఉన్నా సరే, G+1 (గ్రౌండ్ ప్లస్ వన్) పద్ధతిలో ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకోసం కొత్త గైడ్‌లైన్స్ విడుదలయ్యాయి.

కొత్త మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి (Indiramma illu News)

ఇల్లు RCC ఫ్రేమ్‌ నిర్మాణంలో ఉండాలి.
ప్రతి ఇంటిలో తప్పనిసరిగా కిచెన్ మరియు మరుగుదొడ్డి ఉండాలి.
చిన్న స్థలాల్లో కూడా G+1 పద్ధతిలో ఇళ్లు నిర్మించుకోవడానికి అనుమతి ఇచ్చింది.
కనీస కార్పెట్ ఏరియా 323 చదరపు అడుగులు ఉండాలి.
గ్రౌండ్ ఫ్లోర్ రూఫ్ పూర్తయ్యాక ₹1 లక్ష, ఫస్ట్ ఫ్లోర్ కాలమ్స్ పూర్తయ్యాక మరో ₹1 లక్ష, గోడలు పూర్తయ్యాక ₹2 లక్షలు, నిర్మాణం పూర్తయిన తర్వాత ఇంకా ₹1 లక్ష విడుదల చేస్తారు.

Indiramma illu
Indiramma illu

అనుమతులు తప్పనిసరి (Indiramma illu News)

G+1 పద్ధతిలో ఇల్లు నిర్మించాలనుకునే లబ్ధిదారులు ముందుగా గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఈఈ (Deputy Executive Engineer) నుండి అనుమతి తీసుకోవాలి. ఆమోదం పొందిన తరువాతే నిర్మాణ పనులు ప్రారంభించవచ్చు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలతో చిన్న స్థలాలు ఉన్న లబ్ధిదారులు కూడా ఇక సొంత ఇంటి కలను సాకారం చేసుకోవచ్చు. నిబంధనల సడలింపుతో ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగవంతం కానుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870