ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు మరో షాక్ – రూ.60 వేల కోతతో సర్కారు కొత్త నిర్ణయం
Indiramma illu scheme : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. ఇప్పటికే పలు నిబంధనలతో లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వం, ఇప్పుడు స్లాబ్ పూర్తయ్యాక ఇచ్చే రూ. 2 లక్షల బిల్లులో నుంచి రూ. 60 వేల కోత పెట్టింది. ఈ మొత్తాన్ని (Indiramma illu scheme) ఉపాధిహామీ పథకం కింద బాత్రూమ్, ఇతర పనులకు వినియోగిస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. లబ్ధిదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
స్లాబ్ బిల్లులో రూ.60 వేల కోత – పేదలకు కొత్త భారమా?
ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రభుత్వం ప్రారంభం నుంచి పేదలతో ఆటలాడుతోందని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రాగానే 20 లక్షల ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, తర్వాత ఆ సంఖ్యను 4.5 లక్షలకు తగ్గించింది. ఇసుక ఉచితం అంటూనే వాగ్దానం నిలబెట్టుకోలేదని, ప్రతిరోజూ కొత్త నిబంధనలతో పేదలను గందరగోళంలోకి నెట్టిందని ప్రజలు విమర్శిస్తున్నారు.
పేదల నిర్మాణ ఖర్చులు రెట్టింపు!
అంతకంటే ఎక్కువ వైశాల్యమైతే బిల్లులు రద్దు చేస్తామని అధికారుల హెచ్చరికలు వచ్చాయి. కొన్నిచోట్ల అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి 56 గజాలకే అనుమతిచ్చారు. (Indiramma illu scheme) ఫౌండేషన్ వేసిన తర్వాత మొదటి విడత బిల్లు కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు “600 ఎస్‌ఎఫ్‌టీ పూర్తి కాలేదు” అంటూ బిల్లులు నిరాకరించారనే ఆరోపణలు ఉన్నాయి.
మళ్లీ ప్రమాదం – వరుసగా మూడు కార్లను ఢీకొట్టిన కంటైనర్
నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ మండలానికి
అదే విధంగా, ఇల్లు మంజూరైన 45 రోజుల్లో నిర్మాణం ప్రారంభం కాలేదంటే రద్దు చేస్తామనే షరతు మరో ఇబ్బంది కలిగించింది. పేదలు పునాది వేయడానికి కనీసం రూ. 2 లక్షలు అవసరమవుతుందని, ఆ మొత్తాన్ని సర్దుబాటు చేయడం కష్టంగా మారిందని బాధపడుతున్నారు.
దళితబంధు వంటి పథకాలు వచ్చిన తర్వాత కొంతమంది లబ్ధిదారుల ఇళ్లు రద్దు చేసిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ మండలానికి చెందిన ఒక లబ్ధిదారుడి ఇల్లు, (Indiramma illu scheme) అతడు బీఆర్‌ఎస్ సభకు వెళ్లాడన్న కారణంతో రద్దు చేయడం మరింత వివాదాస్పదమైంది.
ఇప్పుడు రూ.60 వేల కోత అంటే మాకు ఎలా సాధ్యం?
ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారులు “ఇప్పుడు రూ.60 వేల కోత అంటే మాకు ఎలా సాధ్యం?” అంటూ ప్రశ్నిస్తున్నారు. (Indiramma illu scheme) ఇసుక రేట్లు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో నిర్మాణ ఖర్చు భారీగా పెరిగిందని వాపోతున్నారు. ట్రాక్టర్ ఇసుక ధర ఒక్కటే రూ. 8 వేల వరకు చేరడంతో ఒక ఇల్లు కట్టడానికి లక్ష రూపాయలు అదనంగా ఖర్చవుతున్నదని చెబుతున్నారు.
లబ్ధిదారులు ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, “ఇంటి నిర్మాణం చివరి దశకు రాగానే ఇలా డబ్బు కోసేయడం సరైన నిర్ణయం కాదు. మేము మొత్తం పనులు మేస్త్రీకి అప్పగించాం, ఇప్పుడు మధ్యలో ఇలా మారిస్తే పేదలు ఎలా బతకాలి?” అని ప్రశ్నిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read also :