हिन्दी | Epaper
కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు

Telugu News: Indiramma illu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్

Pooja
Telugu News: Indiramma illu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇళ్ల(Indiramma illu) పథకంలో కీలక మార్పులు చేసింది. ఉపాధి హామీతో అనుసంధానించి, లబ్ధిదారులకు రూ.5 లక్షల ఆర్థిక సహాయంతో పాటు, జాబ్కార్డు ఉన్నవారికి 90 రోజుల పని కల్పిస్తుంది. రోజుకు రూ.307 చొప్పున అదనంగా రూ.27,630 అందుతాయి. మరుగుదొడ్డికి రూ.12 వేలు. ఇంటి నిర్మాణ దశల వారీగా పనిదినాలు కేటాయిస్తారు. ఈ చర్యలతో ఇళ్లు వేగంగా పూర్తవడంతో పాటు, పేదలకు అదనపు ఆర్థిక భరోసా లభిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల(Indiramma illu) నిర్మాణ పథకంలో కీలక మార్పులు చేసింది. లబ్దిదారులకు తీపికబురు చెబుతూ..

Read Also: Rajni-Kamal: రజనీకాంత్, కమల్ కాంబోలో మల్టీస్టారర్..దర్శకుడు ఎవరంటే?

Indiramma illu

ఈ పద కాన్ని ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తూ పంచాయతీరాజ్ శాఖ(Panchayat Raj Department) ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీని ద్వారా ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయంతో పాటు, జాబ్కార్డు కలిగిన లబ్ధి దారులకు అదనంగా 90 రోజుల పని కల్పించ నుంది. ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి అందించే రూ.5 లక్షల ఆర్థిక సహాయం నాలుగు విడతల్లో లబ్దిదారుల ఖాతాలో జను అవుతుంది. ఉపాధి జాబ్ కార్డు కలిగిన లబ్ధిదారులకు ఉపాధి పని రోజుకు రూ.307 చొప్పున 90 రోజులకు రూ.27,630 ఖాతాల్లో జమ ఇంటి లబ్దిదారులకు రోజుకు రూ.307 చొప్పున కూలీ లభిస్తుంది. ఈ విధంగా గరిష్ఠంగా 90 రోజులకు రూ.27,630 వారి ఖాతాల్లో అదనంగా జమ చేస్తారు.

దీంతో పాటు, స్వచ్చ భారత్ పథకం కింద మరుగుదొడ్డి నిర్మించుకుంటే మరో రూ.12 వేల ఆర్థిక సహాయం కూడా అందుతుంది. ఉపాధి హామీ కింద కల్పించే 90 రోజుల పనిదినాలను నిర్మాణంలోని దశల ఆధారంగా కేటాయిస్తారు. ఇంటి బేస్మెంట్ స్థాయి వరకు 40 రోజులు, లెంటల్ స్థాయి వరకు 30 రోజులు, నిర్మాణం పూర్తయ్యాక 20 రోజుల పనిని కల్పిస్తారు. ఒకవేళ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బేస్మెంట్ వరకు పనులు పూర్తయితే.. మిగిలిన పనిదినాలను వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగించేందుకు వెసులు బాటు కల్పించారు. వేతనాల చెల్లింపుల కోసం,
చిత్రాలు తీసుకొని వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. నిర్మాణం పూర్తైన తర్వాత పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరించగానే లబ్దిదారు ఖాతాలో డబ్బులు జమ అవుతాయి.

అయితే ఇందిరమ్మ లబ్ధిదా రులకు ఇంటి నిర్మాణ పనులు మినహా ఇతర ఉపాధి హామీ పనులు కేటాయిం చరాదని స్పష్ట మైన ఆదేశాలు జారీ అయ్యాయి. సెప్టెం బరు 15న వచ్చిన ఆదేశాల మేరకు అధికా రులు పరిశీలించగా.. చాలామంది లబ్దిదారులకు ఇప్ప టికే జాబ్కార్డులు ఉన్నట్లు తేలింది. జాబ్ కార్డు లేనివారు దరఖాస్తు చేసుకుంటే వెంటనే ఆమో దించేలా చర్యలు తీసుకుంటారు. కొత్తగా పెళ్ల యిన మహిళకు ఇల్లు మంజూరైతే.. అప్పటి కప్పు డు ఎంపీడీవో ద్వారా జాబ్ కార్డు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870