📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్

Indiramma illu : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతాలో అదనంగా రూ.లక్ష జమ

Author Icon By Sai Kiran
Updated: October 11, 2025 • 3:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

1,266 మంది ఖాతాల్లో రూ.12.66 కోట్లు జమ వెనక్కి తిరిగి ఇవ్వాలంటూ అధికారుల ఆదేశాలు

indiramma illu : హైదరాబాద్ రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు నిజంగా ఇది షాకింగ్ వార్తే అని చెప్పవచ్చు. వారి ఖాతాలో జమ అయిన రూ. లక్ష వెనక్కి తిరిగి ఇవ్వాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేస్తు న్నారు. (Indiramma illu) తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంది రమ్మ ఇళ్ల పథకం అమలును వేగవంతం చేసింది. తొలి విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గం నుంచి 3,500 మందికి ఇళ్లు మంజూరు చేసింది. వీటిల్లో చాలా వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. త్వరలోనే గృహ ప్రవేశం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి కొన్ని చోట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

ఇందిరమ్మ ఇళ్ల పథకం నియమాలకు అనుగుణంగా..

ఇంటి నిర్మాణం ప్రకారం దశల వారీగా అధికారులు లబ్దిదారుల ఖాతాలో నగదు జమ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. అధికారులు కొందరు లబ్దిదారుల ఖాతాలో జమ చేసిన రూ. లక్ష వెనక్కి తిరిగి ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో పలువురు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదా రుల ఖాతాల్లో పొరపాటున ఆదనరంగా రూ. లక్ష చొప్పున జమ అయ్యాయని సమాచారం. ఈ విషయం కాస్త,, రాష్ట్ర గృహ నిర్మాణశాఖ అధికారుల దృష్టికి రావడంతో.. వారు దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అదనంగా ఖాతాలో రూ. లక్ష జమ అయిన లబ్దిదారులు ఆ మొత్తాన్ని తిరిగి వెనక్కి ఇవ్వాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారని సమాచారం.

 Read also : ఆయుష్ బలోపేతం – కేంద్రం నుంచి రూ.166 కోట్లు మంజూరు

Indiramma illu

1,266 మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ. 12.66 కోట్లకు పైగా అదనంగా జమ

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,266 మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ. 12.66 కోట్లకు పైగా అదనంగా జమ అయినట్లు తెలు స్తోంది. దసరా పండగకు ముందు ఇళ్ల నిర్మాణ దశలు పూర్తి చేసుకున్న వారికి డబ్బులు జమ చేసే క్రమంలో ఈ పొరపాటు జరిగిందని అధికారులు అభిప్రాయ పడుతు న్నారు. సాంకేతిక సమస్య వల్లనే పలువురు లబ్దిదారుల ఖాతాలో అదనంగా డబ్బులు జమ ఆయ్యా యని.. ప్రస్తుతం ఆ నగదును వెనక్కి తీసుకునే ప్రక్రియ మొద లైందని గృహనిర్మాణశాఖ అధికారులు తెలిపారు.

ఆద నపునగదు జమ గురించి వెంటనే జిల్లాలవారీగా గృహ నిర్మాణశాఖ పీడీలకు సమాచారం అందింది. దీంతో ఏఈలు క్షేత్రస్థాయిలో పర్యటించి.. లబ్దిదారుల ఖాతాలో ఆదనంగా జమ అయిన రూ. లక్షను తిరిగి వచ్చేలా చూడాలని గృహనిర్మాణశాఖ జీఎం (ఫైనాన్స్) విభాగం ఆదేశాలు జారీచేసింది. మరోవైపు, ఆదనంగా జమ అయిన డబ్బులను తిరిగి ఇవ్వాలని బ్యాంకర్లకు కూడా గృహ నిర్మాణ శాఖ లేఖ రాసినట్లు సమాచారం.

అత్య ధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 157 మంది ఉన్నారని తెలుస్తోంది.

ఇలా ఆదనం గా రూ. లక్ష జమ అయిన లబ్దిదారుల్లో.. అత్య ధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 157 మంది ఉన్నారని తెలుస్తోంది. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 119 మంది.. నిజామాబాద్ జిల్లాలో 91 మంది లబ్ధిదారుల ఖాతాల్లో ఆదనంగా డబ్బులు జమ అయ్యాయి. కొందరి నుంచి ఇప్పటికే ఈ మొత్తాన్ని తిరిగి రాబట్టినట్లు సమాచారం.

పలువురి లబ్దిదారుల ఖాతాల్లో రూ.లక్ష చొప్పున అద నంగా జమ అయిన మాట నిజమేనని… అయితే సాంకే తిక సమస్యవల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని.. ఆద నంగా జమ అయిన మొత్తాన్ని రికవరీ చేస్తున్నామని గృహనిర్మాణశాఖకు చెందిన అధికారి ఒకరు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

beneficiaries Breaking News in Telugu Google News in Telugu housing department Indiramma Housing Scheme Inndaramma illu Latest News in Telugu Rangareddy District telangana government Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.