తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మఇళ్ల (Indiramma House)పథకం ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో లాంఛనంగా ప్రారంభమైంది. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న వాసాలమర్రి (Vasalamarri) గ్రామంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ముఖ్య అతిథులు & ప్రజాప్రతినిధులు
ఈ రోజు ఉదయం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాసాలమర్రి (Vasalamarri) గ్రామానికి చేరుకున్నారు. ఆయన వెంట భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యుడు బీర్ల ఐలయ్య, ఆలేరు శాసనసభ్యుడు అనిల్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించిన మంత్రి, స్థానికులతో ముచ్చటించారు.
మొదటి లబ్ధిదారుగా ఆగవ్వ
అనంతరం, ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మంత్రి పొంగులేటి అధికారికంగా ప్రారంభించారు. మొదటి లబ్ధిదారుగా ఎంపికైన ఆగవ్వ అనే మహిళకు ఇంటి స్థలం పట్టాతో పాటు లక్ష రూపాయల చెక్కును అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా ఈ పథకాన్ని అమలు చేస్తోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వాసాలమర్రి గ్రామంలో పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం స్థానికులలో హర్షాతిరేకాలు నింపింది. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన పేదలకు గృహ వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యం
అర్హులైన పేద కుటుంబాలకు నిర్మాణ సహాయంతో గృహ వసతి కల్పించడం. సామాజిక న్యాయం, సౌకర్యవంతమైన నివాసాల కల నెరవేర్చే దిశగా ముందడుగు. గ్రామీణ ప్రాంతాల్లో ఆధునికత & నివాస భద్రతకు మార్గం. వాసాలమర్రి (Vasalamarri) గ్రామస్థులు పథకం ప్రారంభంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.