📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Indiramma Housing Scheme: ముగ్గు పోయని ఇళ్లు రద్దు ఆగస్టు 1 వరకు అవకాశం

Author Icon By Sharanya
Updated: July 21, 2025 • 10:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: తెలంగాణలో పేదల ఇంటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగానే ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ (Indiramma Housing Scheme) ను ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటిని 4 విడతలుగా అమలు (Implementation in 4 phases) చేయనున్నారు. మొదటి విడతలో ఇంటి స్థలం ఉన్న వారికి రూ.5 లక్షలు అందిస్తున్నారు. అయితే ఇళ్లు మంజూరైన చాలా మంది లబ్ధిదారులు ఇప్పటి వరకు ముగ్గు కూడా పోయలేదని తెలుస్తోంది. వారందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ షాకింగ్ న్యూస్ కొద్ది రోజుల క్రితమే చెప్పిన సంగతి తెలిసిందే.

ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టకపోతే మంజూరు రద్దు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma Housing Scheme) లబ్దిదారులకు ఆగస్టు 1వ తేదీలోగా ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టకపోతే (construction of houses is not started) మంజూరు రద్దు చేస్తామని స్పష్టం చేసిన విషయం విధితమే. 2024లో ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల పథకం. రాష్ట్రంలోని పేదలందరికీ ఆశ్రయం కల్పించే బృహత్తర లక్ష్యంతో రూపొందించింది. ప్రభుత్వం ప్రతిఅసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇళ్లను కేటాయించాలని నిర్ణయించి రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో కలిపి4.5 లక్షల గృహ నిర్మాణాలకు రూ.22,500 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. ఈ పథకం కింద. సొంత స్థలం ఉన్న లబ్దిదారులకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తారు. భూమి లేనివారికి ఉచితంగా భూమితో పాటు ఆర్థిక సహాయం కూడా లభిస్తుంది. ఈ ఆర్థిక సహాయం నాలుగు విడతలుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ అవుతుంది. నిర్మాణ పురోగతిని బట్టి నిధులు విడుదల చేస్తారు. జిల్లా కలెక్టర్లు, ఇంజనీరింగ్ విభాగాలు నిర్మాణ ప్రక్రియను పర్యవేక్షిస్తాయి. నాణ్యతా ప్రమాణాలను, సకాలంలో పూర్తి అయ్యేలా చూస్తాయి.

మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లాలో పర్యటించినప్పుడు ఆగస్టు 1లోగా ముగ్గు వేసి నిర్మాణం ప్రారంభించకపోతే లబ్ధిదారుల ఇళ్ల మంజూరు రద్దు కావచ్చని గట్టిగా హెచ్చరించారు. ఈ గడువును పాటించాలని. లేనిపక్షంలో ఆర్థిక సహాయం రద్దు చేయబడుతుందని ఆయన స్పష్టం చేశారు. మొదటి విడతలో సొంత భూమి ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తుండగా.. రెండవ విడతలో భూమి లేని నిరుపేదలకు అవకాశం కల్పిస్తారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించిన మంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను అందించడానికి కట్టుబడి ఉందని నొక్కి చెప్పారు. ఈ పథకంలో దళితులు, ఆదివాసీలు, అల్పసంఖ్యాకులు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రయోజనాలు అందేలా చూస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హత కలిగిన లబ్ధిదారులను గుర్తించడానికి ఈ సంవత్సరం జనవరి 16 నుంచి 25 వరకు సర్వే నిర్వహించారు. ఈ సర్వే ద్వారా అర్హత కలిగిన వారి వివరాలను ధృవీకరించి, జనవరి 26 నుంచి మార్పులను అమలు చేశారు. లబ్దిదారులు తమ అర్హతను ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్ లేదా అప్లికేషన్ నంబర్ ఉపయోగించి తనిఖీ చేసుకోవచ్చు .

ఇందిరమ్మ హౌసింగ్ స్కీం అంటే ఏమిటి?


ఇందిరమ్మ హౌసింగ్ స్కీం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సామాజిక సంక్షేమ పథకాలలో ఒకటి. ఈ పథకం ద్వారా ఆర్థికంగా బలహీనవర్గాలకు ఉచితంగా లేదా నామమాత్ర ధరలకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించబడుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Read also: Sriganesh : ఎమ్మెల్యే శ్రీగణేశ్ పై దాడికి యత్నించిన దుండగులు

Breaking News CM Revanth Reddy Incomplete Houses Indiramma Housing Scheme latest news Telangana Development Telangana Government Schemes Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.