📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్దిదారులకు రూ.700 కోట్లు చెల్లింపు

Author Icon By Shravan
Updated: August 6, 2025 • 3:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) పథకానికి నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు రూ.700 కోట్లు విడుదల చేయగా.. ఆగస్టు 4న ఒక్కరోజే రూ.130 కోట్లు లబ్దిదారుల ఖాతాల్లో జమచేశారు. గృహ నిర్మాణాన్ని ప్రోత్స హించేందుకు ప్రతి సోమవారం డబ్బులు బదిలీ చేస్తున్నారు. ఈ పథకం కోసం హడ్కో నుంచి రూ.500 కోట్ల లోన్ కూడా తీసుకున్నారు. ప్రస్తుతం లక్షన్నరకు పైగా ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. తెలంగా ణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. 6 గ్యారంటీలలో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా.. లబ్దిదారులను ఎంపిక చేసి ఇండ్ల నిర్మాణాలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా లక్షన్నరకు పైగా ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ మేరకు లబ్దిదారులకు తీపికబురు చెబుతూ అకౌంట్లలో డబ్బులు జమ చేస్తోంది. ప్రభుత్వం ఇప్పటివరకు రూ.700 కోట్లు విడుదల చేసింది. ఇళ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించడానికి, నిధులు ఆలస్యం కాకుండా ప్రతి సోమవారం లబ్దిదారుల ఖాతాలకు నేరుగా డబ్బు బదలీ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,08,702 ఇళ్లను మంజూరు చేయగా వాటిలో 1,77,932 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని అధికారులు తెలిపారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు లబ్దిదారులకు రూ.5 లక్షలు సాయాన్ని మెత్తం నాలుగు దశల్లో అందజేయ నున్నారు. ఈ నెల 4నఒక్కరోజే రూ.130 కోట్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదలీ చేసినట్లు అధికారులు తెలిపారు.

ప్రతి సోమవారం లబ్దిదారుల ఖాతాల్లోకి డబ్బులు (Money into accounts) జమ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పథకం ప్రారంభించే సమయంలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నిధుల కొరత రాకుండా చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ హామీకి అనుగుణంగా.. నిధుల విడుదలలో ప్రభుత్వం గ్రీన్ ఛానెల్ విధానాన్ని అనుసరిస్తోంది. లబ్దిదారులకు సకాలంలో నిధులు విడుదల చేసేందుకు గృహ నిర్మాణ పథకం కోసం హడ్ కో నుంచి రూ.500 కోట్ల లోన్ కూడా సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల హౌసింగ్ బోర్డు ఓపెన్ ప్లాట్లు, రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు వేలం నిర్వహించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకానికే ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగవంతంగా ముందుకు సాగుతుందని.. నిధుల కొరత లేకుండా లబ్దిదారులకు సకాలంలో సాయం అందు తుందని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో హౌసింగ్ సెక్రటరీ, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ అన్ని జిల్లాల అధికారులతో ఇళ్ల నిర్మాణం పురోగతి, సమస్యల గురించి చర్చించిన సంగతి తెలిసిందే.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/lrs-only-lrs-applications-submitted-within-the-notification-deadline-will-be-allowed-suresh-kumar/andhra-pradesh/526917/

Breaking News in Telugu Indiramma Beneficiaries Indiramma Housing Scheme Latest News in Telugu Telugu News Today Welfare Housing 2025 ₹700 Crores Released

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.