Indiramma houses scheme : ఉపాధి కోసం కొనుగోలు చేసిన కారు ఇప్పుడు సొంతింటి కలకు అడ్డంకిగా మారుతోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దళితబంధు పథకం కింద కార్లు కొనుగోలు చేసి క్యాబ్ డ్రైవర్లుగా జీవనోపాధి పొందుతున్న పలువురు, ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అనర్హులుగా మారిపోతున్నారు. సొంతిల్లు లేని నిరుపేద కుటుంబాలైనా, వారి పేరులో కారు ఉండటమే ఇందిరమ్మ ఇంటి ఆర్థిక సాయం కోల్పోయే పరిస్థితిని తెచ్చిపెట్టింది.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభ సమయంలో అర్హతలు, అనర్హతలపై పూర్తి స్పష్టత లేకపోవడంతో ఈ గందరగోళం తలెత్తింది. ముఖ్యంగా క్యాబ్ డ్రైవర్ల విషయంలో సమస్య తీవ్రంగా ఉంది. హైదరాబాద్ నగరంలో క్యాబ్ సేవలు వేలాది మందికి ఉపాధిగా మారాయి. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు తగ్గడంతో, గతంలో దళితబంధు ఆర్థిక (Indiramma houses scheme) సాయంతో కార్లు కొనుగోలు చేసిన యువకులు క్యాబ్ డ్రైవింగ్ వైపు మళ్లారు. అప్పట్లో నిరుపేదలుగా అర్హత పొందిన వారే, ఇప్పుడు ‘కారు ఉంది’ అన్న కారణంతో ఇందిరమ్మ పథకానికి అనర్హులవడం చర్చనీయాంశంగా మారింది.
నిబంధనే అడ్డంకి
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ‘సొంత కారు ఉండకూడదు’ అనే నిబంధన ఉంది. కారు కొనగలిగే స్థోమత ఉంటే నిరుపేద కాదన్న ఉద్దేశంతో ఈ షరతును చేర్చారు. కానీ జీవనోపాధి కోసం క్యాబ్ నడిపే వారిని కూడా ఇదే కోవలోకి తీసుకోవడం పట్ల లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల పేరులో కారు ఉండటం వల్ల కూడా చాలామంది అనర్హులయ్యారు.
Read Also: Nellore: స్పోర్ట్స్ స్టేడియం అభివృద్ధికి 1.80 కోట్లు మంజూరు: మంత్రి ఆనం
క్షేత్రస్థాయి పరిశీలనలో అనేక మంది క్యాబ్ డ్రైవర్ల పేదరిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు మొదట అర్హులుగా గుర్తించారు. ఫలితంగా వారికి ఇళ్లు మంజూరు చేసి నిర్మాణం కూడా ప్రారంభమైంది. అయితే బిల్లుల చెల్లింపుల సమయంలో ఆధార్ వెరిఫికేషన్‌లో కారు ఉన్న విషయం వెలుగులోకి రావడంతో ఆర్థిక సాయాన్ని నిలిపివేశారు. ఒకసారి అర్హులుగా గుర్తించి, ఇళ్లు మంజూరు చేసిన తర్వాత మళ్లీ అనర్హులుగా ప్రకటించడంపై లబ్ధిదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై స్థానిక ఎమ్మెల్యేలను ఆశ్రయించగా, క్యాబ్ డ్రైవర్లను అర్హులుగా పరిగణించాలంటూ వారు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: