📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Indiramma Houses : 1,950 ఇందిరమ్మ ఇళ్లు రద్దు

Author Icon By Digital
Updated: August 2, 2025 • 10:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లు(Indiramma Housing Scheme) పొందిన వారికి ప్రభుత్వం భారీ షాకి చ్చింది. 1,950 మంది ఇళ్లను రద్దు చేసింది. వీరంతా బెస్మెంట్ వరకు నిర్మాణం పూర్తిచేసి, తొలివిడత ఆర్ధిక సాయం రూ. లక్ష కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో ప్రభుత్వం వీరి ఇళ్లను రద్దు చేసింది. వీరి స్థానంలో కొత్త వారికి ఇళ్లను కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం పేదవారి సొంతింట కల సాకారం కోసం ఇంది రమ్మ ఇళ్ల(Indiramma Housing Scheme) పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలి విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గం నుంచి 3,500 మందికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించగా ప్రస్తుతం అవన్నీ ఇప్పుడు నిర్మాణంలో ఉన్నాయి. ఆగస్టు 15 నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఒకేసారి పెద్ద సంఖ్యలో గృహ ప్రవేశం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆర్హులకే ఇందిరమ్మ ఇళ్లను కేటాయించేందుకు ప్రభుత్వం ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా. కొన్నిచోట్ల ఆనర్హులకు ఇళ్లు దక్కుతున్నాయి. గ్రామాల్లో పంచాయతీ కార్య దర్శులు చేస్తున్న తప్పులతో అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతున్నట్లు అధికారులు గుర్తించారు.

1,950 మంది అనర్హులు

హౌసింగ్ వెరిఫికేషన్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో 1,950 మందిజనర్హులు ఇందిరమ్మ ఇళ్లు పొందినట్లు వెల్లడైంది. బెస్మెంట్ పూర్తయిన తరువాత.. మొదటి విడతలో భాగంగా రూ. లక్ష చెల్లించే సమయంలో ఈ 1.950 మంది అనర్హులను గుర్తించారు. దీనిపై హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ మాట్లాడుతూ వెంటనే వీరికి మంజూరు చేసిన ఇండ్లను రద్దు చేసి..

వీరికి బదులు కొత్త లబ్దిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు బాధ్యులైన సెక్రటరీలను సస్పెండ్ చేశాలని తెలిపారు. ఈ పథకానికి సంబందించి మొదడి విడతలో సొంత జాగా ఉండి ఇల్లు లేని వారికే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నామని ఏండీ గౌతమ్ తెలిపారు. అయితే తాజాగా చేపట్టిన తనిఖీల్లో అనర్హులుగా గుర్తించిన ఈ 1950 మంది గతంలోనే ఇంటి నిర్మాణం ప్రారంభించి.

బెస్మెంట్ వరకు నిర్మించి వదిలేసిన వారని తెలిపారు. పంచాయతీ సెక్రటరీలు వీరి ఫొటోలను యాప్లో అప్లోడ్ చేశారు. ఇందిరమ్మ(Indiramma) ఇళ్లకు సంబంధించి దశల వారీగా పలువురు అధికారులు. అపై కలెక్టర్ ఆమోదం తెలిపిన తర్వాతే లబ్దిదారులకు బిల్లులు చెల్లిస్తున్నా మన్నారు. ఐనప్పటికీ కొన్ని చోట్ల జరిగి.. అనర్హులు కూడా తప్పులు. పొందారన్నారు.

రానున్న రోజుల్లో ఇలాంటి తప్పులు జరగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని గౌతమ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన నియమ నిబంధనల గురించి ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఇందిరమ్మ మొబైల్ యాప్లో ఫొటో క్యాప్చర్ సమయంలో సెక్రటరీలు తప్పులు చేస్తున్నారని దీనిలో పేర్కొన్నారు. ఇందరిమ్మ ఇంటి నిర్మాణం 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో జరగాలని..

కచ్చితంగా రెండు రూమ్లు, కిచెన్, బాత్రూం నిర్మించాలని సూచించారు. పునాదికి ముందు వైపు, పక్కల వెంట, పై నుంచి ఫొటో తీసి అప్లోడ్ చేయాలని తెలిపారు. ఇంటి నిర్మాణం. పూర్తయ్యే వరకు దశల వారీగా హౌసింగ్ ఏఈలు తనిఖీ చేయాలని ఆదేశించారు.

Read hindi news Also: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/farmer-welfare-funds-deposited-for-annadata-sukhibhav-scheme-46-85-lakh-farmers-benefitted/andhra-pradesh/524621/

Breaking News Indiramma Houses Indiramma houses cancelled latest news Telangana news Telugu News TG news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.