📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల

Telugu News: Indiramma illu: బాధితులకు బాసటగా ఇందిరమ్మ ఇళ్ల కాల్ సెంటర్

Author Icon By Pooja
Updated: September 26, 2025 • 10:33 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం విషయంలో ఎటువంటి అవినీతి, అక్రమాలకు చోటు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న గట్టి చర్యలు ప్రజలను చైతన్యపరుస్తున్నాయి. అందుకే ఏ చిన్న సమస్య వచ్చినా లబ్దిదారులు ఏమాత్రం సంకోచించ కుండా ఇందిరమ్మ ఇండ్ల కాల్ సెంటర్ను ఆశ్రయి స్తున్నారు. ఈ కాల్ సెంటర్ బాధితులకు బాసటగా నిలుస్తోంది.

ఫిర్యాదులపై వెంటనే చర్యలు

కాల్ సెంటర్ నెంబర్ 1800 599 5991కు ఫిర్యాదు వచ్చిన గంటల్లోనే సదరు ఫిర్యాదులు, సమస్యలపై అధికారులే నేరుగా రంగంలోకి దిగి తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. కాల్ సెంటర్ కు వచ్చే ఫిర్యాదులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిరోజు తన కార్యాలయానికి తెప్పించుకొని పరిశీలిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల మంజూరులో లంచాలు అడుగు తున్న అధికారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు.

ఫిర్యాదు వచ్చిన 24 గంటల్లోనే బాధితులకు న్యాయం చేసి సంబంధిత అధికారులపై చర్యలు చేపడుతున్నారు. డబ్బుల కోసం పేదలను వేధిస్తే ఫిర్యాదు చేసిన 24 గంటల్లో విచారణ జరిపి క్రిమినల్ కేసుల(Criminal cases) నమోదు చేస్తామని అధికారులు, ఇందిరమ్మ కమిటీలను హెచ్చరించారు. మంత్రిగారు ఇచ్చిన హామీని నిలబెట్టు కుంటూ కాల్సెంటర్ లో నమోదయ్యే ఫిర్యాదులపై విచారణ జరుగుతోంది. ఇప్పటికే పలువురు ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ కార్యదర్శులపై వేటు పడింది.

Read Also: సికింద్రాబాద్‌ నుంచి మరో రెండు కొత్త వందే భారత్‌ రైళ్లు

లబ్ధిదారుల నమ్మకానికి నిదర్శనం

తాజాగా 20 కొంతమంది ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఫిర్యాదులను గమనిస్తే.. వారికి కాల్ సెంటర్పై ఎంత నమ్మకం ఏర్పడిందో అర్థమవుతుంది. అంతేగాక ఓ లబ్దిదారు ఏకంగా పోలీసు స్టేషన్లోనే ఇందిరమ్మ కమిటీ సభ్యునిపై ఫిర్యాదు చేయడం కూడా వారిలో పెరిగిన ఆత్మస్థైర్యానికి నిదర్శనంగా నిలిచింది.

ఉదాహరణలు

సంగారెడ్డి జిల్లా నిజాంపేట, ఏదుల తండాకు చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారు అంగోత్ తులసీభాయి నేరుగా హౌసింగ్ కార్పొరేషన్లోని కాల్ సెంటర్ కు ఫోన్ చేసి తన ఇల్లు నిర్మాణం పునాదుల వరకు పూర్తయిందని అయితే అంతవరకు ఫోటో తీసి పంపడానికి గాను పంచాయితీ కార్యదర్శి పి. మహబూబ్ అలీ 10 వేల రూపాయిలు డిమాండ్(Demand) చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. విచారణలో ఫోన్ పే ద్వారా అతనికి డబ్బులు చెల్లించినట్లు అధికారుల విచారణలో తేలింది.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం మాజిద్పూర్ కు చెందిన కల్లె సత్యాలు అనే ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారు నేరుగా కాల్ సెంటర్కు ఫోన్ చేసి తమ పంచాయితీ కార్యదర్శి రాఘవేంద్ర పలు రకాలుగా సమస్యలు సృష్టించి వేధిస్తు న్నారని, 20 వేల రూపాయిలు లంచంగా ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇంతవరకు ఇల్లు బేస్మెంట్ వరకు పూర్తయిందని, ఇప్పుడు గ్రామ పైప్లైన్కు అడ్డంగా ఉందని చెప్పి ఇంటి ఫోటో కూడా తీయకుండా వేధిస్తున్నారని ఆమె కాల్సెంటర్కు తెలిపారు. దీనిపై అధికారులు లోతైన విచారణ జరుగుతున్నారు.

నాగర్ కర్నూలు జిల్లా తాండూరు మండలం సిర్సవాడ గ్రామానికి చెందిన ఏదుల భీమమ్మ అనే ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారు చేపట్టిన ఇంటి నిర్మాణానికి అడ్డుపడుతూ, ఆమెను బెదిరించి డబ్బు వసూలు చేసినట్లు అందిన ఫిర్యాదుపై స్థానిక పోలీసుల కేసు నమోదు చేశారు. ఆమె ఫిర్యాదులోని వివ రాల ప్రకారం భీమమ్మకు ఇందిరమ్మ ఇల్లు మం జూరుకాగా ఆమె బావ ఏదుల నారాయణ తన భార్య పిల్లలతో కలిసి ఇంటి నిర్మాణాన్ని అడ్డు పడ్డారు. నారాయణకు అండగా నిలిచిన ఇందిరమ్మ కమిటీ సభ్యుడు చిక్కోండ్ర మల్లేష్ జోక్యం చేసుకొని రూ. 25వేలను డిమాండ్ చేశాడు. భీమమ్మ రూ.10 వేలను మల్లేష్కు ఇచ్చారు. అయినప్పటికీ ఏదుల నారాయణకు మల్లేష్ మద్దతుగా నిలిచి తనను మోసం చేశారని, వీరం దరిపై తగు చర్యలు తీసుకోవాలని భీమమ్మ తాండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల కాల్ సెంటర్ నంబర్ ఏమిటి?
1800 599 5991

ఫిర్యాదులకు ఎంత సమయంలో పరిష్కారం లభిస్తుంది?
సాధారణంగా 24 గంటల్లో విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Anti-Corruption Call Center housing corporation Indiramma Housing Scheme Latest News in Telugu telangana government Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.