సికింద్రాబాద్ మరియు తిరుపతి మధ్య తరచుగా జరిగే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (Indian Railways) కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ రెండు నగరాల మధ్య ప్రత్యేక రైళ్ల (Special trains)ను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ప్రయాణికులకు తాత్కాలికంగా పెద్ద ఉపశమనం లభించనుంది.
రెండు ప్రత్యేక రైళ్లు అందుబాటులో
రైల్వే సీపీఆర్వో శ్రీధర్ (Railway CPRO Sridhar)వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ రోజు తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు (07097) బయలుదేరనుంది. అదే విధంగా, రేపు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు (07098) అందుబాటులో ఉంటుందని తెలిపారు.
మార్గమధ్య ఆగే స్టేషన్లు
ఈ ప్రత్యేక రైళ్లు మార్గమధ్యంలోని పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి. ముఖ్యంగా:
రేణిగుంట, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూర్, కృష్ణ, యాద్గిర్, తాండూర్, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట్ అని అధికారులు స్పష్టంచేశారు.
ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక సర్వీసులు నడపబడుతున్నాయని రైల్వే శాఖ పేర్కొంది. తిరుపతి–సికింద్రాబాద్ మార్గంలో ప్రయాణించాలనుకునే వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: