📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: Indian Railways: వారం రోజుల పాటు 32 రైళ్లు రద్దు

Author Icon By Anusha
Updated: October 11, 2025 • 12:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

డోర్నకల్-పాపటపల్లి రైలు మార్గంలో మూడో లైన్ మరమ్మతుల కారణంగా రైల్వే ప్రయాణికులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ మార్గంలో రైల్వే track కు నిర్వహణ, మరమ్మతులు చేయడం కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులు (South Central Railway Officials) ప్రకటించారు.

Inndaramma illu : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతాలో అదనంగా రూ.లక్ష జమ

ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు ఏకంగా 32 రైళ్లను రద్దు చేస్తున్నట్లు, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయడంతో పాటు రీషెడ్యూల్ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

ఈ మార్పులు నేటి నుంచి 18వ తేదీ వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.రద్దయిన రైళ్ల జాబితాలో పలు కీలక సర్వీసులు ఉన్నాయి. విశాఖపట్నం-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్, స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్‌సిటీ, పూరి-ఓకా ద్వారకా ఎక్స్‌ప్రెస్‌తో పాటు డోర్నకల్-కాజీపేట, విజయవాడ-డోర్నకల్ మధ్య నడిచే మెమో ప్యాసింజర్ రైళ్లు (Memo Passenger Trains) కూడా ఉన్నాయి.

Indian Railways

రైళ్ల రద్దుతో పాటు కొన్ని ప్రధాన రైళ్లను అధికారులు రీషెడ్యూల్ చేశారు. ఆదిలాబాద్-తిరుపతి కృష్ణా ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 13, 16, 17 తేదీల్లో గంటన్నర ఆలస్యంగా బయలుదేరనుంది. అదేవిధంగా, విశాఖపట్నం-సికింద్రాబాద్ (Visakhapatnam-Secunderabad) మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు 15, 16, 18 తేదీల్లో గంటన్నర ఆలస్యంగా ప్రయాణిస్తాయని తెలిపారు.

పాక్షికంగా రద్దు

సికింద్రాబాద్-గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 14 నుంచి 18 వరకు కాజీపేట-గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేశారు. ఈ రైలు కేవలం సికింద్రాబాద్-కాజీపేట మధ్య మాత్రమే నడుస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

సికింద్రాబాద్ నుంచి త్రివేండ్రం వెళ్లే శబరి ఎక్స్‌ప్రెస్ (20629)లో కోచ్ మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నేడు బయలుదేరనున్న ఈ రైలులోని ఫస్ట్ ఏసీ కోచ్‌ (AC Coach) లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో, దాని స్థానంలో అదనంగా ఒక సెకండ్ ఏసీ కోచ్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News Dornakal Papathapalli railway latest news Telugu News train cancellations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.