కాన్ థో నగరంలో బుధవారం ఓ దారుణ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తెలంగాణకు (To Telangana) చెందిన 21 ఏళ్ల అర్షిద్ అశ్రిత్ (Arshid Ashrit) ప్రాణాలు కోల్పోయాడు.అర్షిద్ అక్కడ ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం తన స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తున్నాడు. అతివేగంతో బైక్ అదుపుతప్పి గోడను ఢీకొట్టింది. అర్షిద్ అక్కడికక్కడే మృతి చెందాడు.అర్షిద్‌తో బైక్‌పై ఉన్న స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.
ఘటనా దృశ్యాలు సీసీటీవీలో రికార్డు
ప్రమాదం జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు వైరల్ అవుతోంది. బైక్ వేగంగా వచ్చి గోడను ఢీకొట్టడం, ఇద్దరు గాల్లోకి ఎగిరిపడిన దృశ్యాలు కలచివేస్తున్నాయి.
తల్లిదండ్రుల ఆశలు చెరిపిన విషాదం
అర్షిద్ తల్లిదండ్రులు అర్జున్, ప్రతిమ వస్త్ర వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తమ కుమారుడు డాక్టర్ అయ్యే రోజు కోసం ఎదురుచూస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఎమ్మెల్యే పరామర్శ, కేంద్ర మంత్రి సహాయం కోరిన నేత
ఘటన విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పి. హరీశ్ బాబు అశ్రిత్ ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. మృతదేహాన్ని భారత్‌కు రప్పించేందుకు సహాయం చేయాలని మంత్రి కిషన్ రెడ్డిని అభ్యర్థించారు.ఈ దుర్ఘటనతో అశ్రిత్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. బంధువులు, స్నేహితులు విషాదంలో గడుపుతున్నారు.
Read Also : Sharmistha Panoly : శర్మిష్ఠ పనోలీకి ఊరట… బెయిల్ మంజూరు