📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

ఇందిరమ్మ భరోసాపై సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలు!

Author Icon By Vanipushpa
Updated: January 27, 2025 • 4:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో సంక్షేమ పథకాల జాతర నడుస్తోంది. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26వ తేదీన రేవంత్ రెడ్డి సర్కార్.. నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించింది. ఇందులో ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసాతో పాటు భూమి లేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కూడా ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. ఈ పథకం కింద.. భూమిలేని రైతు కూలీలకు సంవత్సరానికి రూ.12 వేల చొప్పున రెండు దఫాలుగా ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ క్రమంలో.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం విషయంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నారాయణపేటకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. భూమి లేని రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు చెల్లించేలా రేవంత్ రెడ్డి సర్కార్ పథకం రూపొందించిందని.. పట్టణ (మున్సిపాలిటీల పరిధిలో) రైతు కూలీలకు మాత్రం డబ్బులు ఇవ్వడం లేదని శ్రీనివాస్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

కాగా.. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టగా.. పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని 129 మున్సిపాలిటీల్లో మొత్తంగా 8 లక్షల మందికి పైగా రైతు కూలీలు ఉన్నారని హైకోర్టుకు చిక్కుడ ప్రభాకర్ తెలిపారు. గ్రామాల్లోని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చి.. మున్సిపాలిటీల్లోని వారికి ఇవ్వకపోవడం ఏమాత్రం సరికాదని తెలిపారు. రైతు కూలీలు అందరూ సమానమేనని.. ఎక్కడ ఉన్నా అందరూ కూలీలే అని వివరించారు. కేవలం గ్రామాల్లోని రైతు కూలీలకే పథకం వర్తింపజేయడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాధించారు. పిటిషనర్ తరపు వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ పిటిషన్‌పై 4 వారాల్లో తుది నిర్ణయం వెల్లడించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

High court Indiramma Aatmiya Bharosa Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.