📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: VC Sajjanar: మద్యం సేవించి వాహనాలు నడిపితే ఇక జైలుకే: సీపీ సజ్జనార్

Author Icon By Anusha
Updated: October 6, 2025 • 3:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ యూనిఫాం ధరిస్తూ డ్యూటీలోకి ఎంట్రీ ఇచ్చిన సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ (VC Sajjanar), హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. పదవిలోకి వచ్చిన వెంటనే తనదైన శైలిలో చర్యలు ప్రారంభించిన ఆయన, నగర శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.

BC Reservation : రిజర్వేషన్లపై పిటిషన్ డిస్మిస్

గతంలో సైబరాబాద్ కమిషనర్‌గా ఉన్నప్పుడు చేసిన స్మార్ట్ పోలీసింగ్‌ చర్యలతో సజ్జనార్ ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఇప్పుడు తిరిగి సీపీగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. తాజాగా.. డ్రంక్ అండ్ డ్రైవ్‌ (Drunk and drive) విషయంలో మందుబాబులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

గత నాలుగేళ్లుగా టీజీఎస్ఆర్టీసీ ఎండీగా పనిచేసిన సజ్జనార్

గత నాలుగేళ్లుగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ (TGSRTC MD) గా పనిచేసిన సజ్జనార్.. ఇప్పుడు సీపీగా చార్జ్ తీసుకొని ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యారు.మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై ఉక్కుపాదం మోపుతామని.. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ మేరకు సీపీ సజ్జనార్ డ్రంక్ అండ్ డ్రైవ్‌పై తమ అధికారిక ట్విట్టర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. వాహనదారులకు హితవు పలుకుతూ.. బాధ్యతగల పౌరులుగా వ్యవహరించాలని కోరారు. ‘మద్యం తాగి వాహనాలు నడిపి, రోడ్డు ప్రమాదాలకు కారణమై మీ జీవితానికి మీరే వెలకట్టలేని జరిమానాను విధించుకోవద్దు.

VC Sajjanar

థింక్ బిఫోర్ యూ డ్రింక్ అండ్ డ్రైవ్

డ్రంకెన్ డ్రైవ్ మీతో పాటు ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగుల్చుతుంది. థింక్ బిఫోర్ యూ డ్రింక్ అండ్ డ్రైవ్. గుర్తుపెట్టుకోండి.. మద్యం తాగి వాహనం నడిపితే మూల్యం తప్పదు. బాధ్యత గల పౌరులుగా మద్యం తాగి వాహనం నడపకండి.’ అని సజ్జనార్ ట్వీట్ చేశారు.

హైదరాబాద్‌ను పట్టిపీడిస్తున్న డ్రగ్స్‌ (Drugs) పై ఉక్కుపాదం మోపుతామని గతంలోనే సజ్జనార్ ప్రకటించారు. ఈ విషయంలో ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుని.. అవసరమైతే అదనపు సిబ్బందిని కేటాయించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఆన్‌లైన్ బెట్టింగ్‌ల కారణంగా యువత చెడిపోతోందని

నగరంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, ‘డిజిటల్ అరెస్టులు’ పేరుతో వచ్చే మోసాలకు దూరంగా ఉండాలని సూచించారు.ఇక, ఆన్‌లైన్ బెట్టింగ్‌ల కారణంగా యువత చెడిపోతోందని, బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లలో పాల్గొనే వీఐపీలు ఆలోచించుకోవాలని ఆయన గట్టిగా హెచ్చరించారు.

ట్రాఫిక్ సమస్య, కల్తీ ఆహారంపై ప్రత్యేక దృష్టి సారించి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని సజ్జనార్ స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని ‘రోడ్ టెర్రరిస్టులుగా’ పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని, మహిళలు, చిన్నారులపై వేధింపులకు పాల్పడితే సీరియస్‌గా తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News drunk and drive warning Hyderabad News Hyderabad Police Commissioner IPS officer latest news Law Enforcement Telugu News VC Sajjanar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.