📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Ibrahimpatnam: ఇంటి పన్ను వసూళ్లకు స్పెషల్ డ్రైవ్

Author Icon By Tejaswini Y
Updated: February 27, 2026 • 11:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇబ్రహీంపట్నం, ప్రభాతవార్త : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam) మున్సిపాలిటీలో పన్ను వసూళ్ల పర్వం ఊపందుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో, పెండింగ్‌లో ఉన్న ఇంటి పన్నులను వసూలు చేయడంపై మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ బిల్ కలెక్టర్లతో గురువారం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించి, వసూళ్లపై దిశానిర్దేశం చేశారు.

Read Also: Telangana: టీచర్ల పనితీరు ఆధారంగా ప్రమోషన్లు

Ibrahimpatnam: ఇంటి పన్నులను వంద శాతం వసూలు

మున్సిపాలిటీకి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఇంటి పన్నులను వంద శాతం వసూలు చేయడమే ధ్యేయంగా పనిచేయాలని కమిషనర్ సిబ్బందిని ఆదేశించారు. వార్డుల వారీగా ఉన్న బకాయిల జాబితాను సిద్ధం చేసి, ప్రతి ఇంటికి వెళ్లి పన్ను వసూలు చేయాలని సూచించారు. మున్సిపల్ ప్రజలు తమ ఇంటి పన్నును సకాలంలో చెల్లించి ఇబ్రహీంపట్నం పురోగతికి తోడ్పడాలని కమిషనర్ కోరారు. రహదారులు, మురుగునీటి కాలువలు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల కల్పన పన్నుల రూపంలో వచ్చే ఆదాయంతోనే సాధ్యమవుతుందని ఆయన వివరించారు. బకాయిలు ఉన్నవారు అపరాధ రుసుము పడకుండా ముందే చెల్లించాలని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ibrahimpatnam Municipal Commissioner Sudarshan Property Tax Collection Rangareddy district news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.