📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Ibrahimpatnam Municipal Elections: ఇబ్రహీంపట్నంలో హైడ్రామా..మున్సిపల్ పీఠంపై వీడని ఉత్కంఠ!

Author Icon By Tejaswini Y
Updated: February 17, 2026 • 4:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Ibrahimpatnam Municipal Elections: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఉదయం నుంచి సాగుతున్న హైడ్రామా సాయంత్రం అవుతున్నా ఒక కొలిక్కి రాకపోవడంతో అటు నాయకుల్లో, ఇటు ప్రజల్లో ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. కోర్టు నుంచి స్టే వచ్చిందన్న ప్రచారం జరుగుతున్నా, దానికి సంబంధించిన అధికారిక స్టే ఆర్డర్ కాపీ అందకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. స్టే కాపీ రానప్పుడు ఎన్నికను ఎందుకు ప్రకటించడం లేదని బీఆర్ఎస్(BRS) సభ్యులు పట్టుబడుతున్నారు. వెంటనే “చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పత్రం ఇవండి లేదా స్టే ఆర్డర్ కాపీని చూపించలి” అని వారు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దాదాపు మూడు గంటలుగా సభ్యులు కార్యాలయంలోనే వేచి చూస్తున్నారు.

Read Also: Mancherial corporation : మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ ఖాతాలో, తాజా ఫలితాలు

Ibrahimpatnam Municipal Elections

చేతులెత్తేసిన అబ్జర్వర్?

ఉదయం 10:45 గంటలకు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న జిల్లా ఎన్నికల అబ్జర్వర్ మయాంక్ మిట్టల్ పరిస్థితిని సమీక్షించారు. అయితే, ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండానే ఆయన అక్కడి నుంచి మధ్యలోనే వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. పంచాయతీ తేలకుండానే అబ్జర్వర్ నిష్క్రమించడంతో గందరగోళం మరింత పెరిగింది.

“స్టే కాపీ లేకుండ ఎన్నిక ఆపడం అన్యాయం…

అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించాలి.” అని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన బాటలో మద్దతుదారులు ఒకవేళ స్టే కాపీ అందకుండానే ఎన్నికను వాయిదా వేస్తే పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే కార్యాలయం వెలుపల భారీగా కార్యకర్తలు మోహరించారు. ఆందోళనకు సిద్ధమవుతున్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చివరి నిమిషంలో స్టే కాపీ అందుతుందా? లేక ఎన్నిక ప్రకటిస్తారా? అనేది ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో హాట్ టాపిక్‌గా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Ibrahimpatnam Municipal Elections ibrahimpatnam tension Ranga Reddy District News telangana local body elections

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.