ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 14, ప్రభాతవార్త: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో(Ibrahimpatnam Municipal Election Results) ఓట్ల శాతం పరంగా కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించిందని, ప్రజల మద్దతు స్పష్టంగా తమవైపే ఉందని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో పోలైన మొత్తం ఓట్లలో 45 శాతం 9035 ఓట్లు సాధించి, ప్రధాన ప్రత్యర్థి బిఆర్ఎస్ కంటే 1251 ఓట్ల భారీ మెజారిటీతో కాంగ్రెస్ అగ్రస్థానంలో నిలిచిందని ఆయన గణాంకాలతో వివరించారు.
Read Also: BJP donations : బీజేపీకి వేల కోట్ల విరాళాలు, కాంగ్రెస్‌కు ఎందుకింత తక్కువ?
ఇబ్రహీంపట్నం అభివృద్ధికి నిరంతరం
అయితే, దురదృష్టవశాత్తూ పార్టీ రెబల్ అభ్యర్థులు చీల్చిన నాలుగు శాతం ఓట్ల వల్ల ఆరు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు కేవలం అతి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలవ్వడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెబల్స్ ఓట్లు కూడా కలిపి ఉంటే కాంగ్రెస్(Congress) బలం 49 శాతానికి చేరుకునేదని, కేవలం అంతర్గత విభేదాల వల్లే గెలవాల్సిన సీట్లు చేజారిపోయాయని ఆయన విశ్లేషించారు. బిఆర్ఎస్ కేవలం 38 శాతానికే పరిమితమైందని, ప్రజలు ఆ పార్టీని పూర్తిగా తిరస్కరించారని ఎద్దేవా చేసిన మల్ రెడ్డి రంగారెడ్డి, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని, ప్రజల అండతో ఇబ్రహీంపట్నం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: