Ibrahimpatnam: మాపైనే వార్తా రాస్తావా..రిపోర్టర్ కి ఎంపీఓ ఉషాకిరణ్ బెదిరింపులు

Read Time:  1 min
Ibrahimpatnam: మాపైనే వార్తా రాస్తావా..రిపోర్టర్ కి ఎంపీఓ ఉషాకిరణ్ బెదిరింపులు
FONT SIZE
GET APP

Ibrahimpatnam: ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీఓ తీరు వివాదాస్పదంగా మారింది. ఆదివారం వార్త దినపత్రికలో ‘‘ప్రజాపాలనకు తాళం.. సామాన్యులకు నో ఎంట్రీ’’ అనే శీర్షికతో వార్తా దినపత్రికలో ప్రచురితమైన కథనంపై సదరు అధికారి తీవ్రస్థాయిలో ఊగిపోయారు. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను ప్రచురించినందుకు గాను సోమవారం తన సిబ్బంది ద్వారా వార్త రిపోర్టర్‌ను కార్యాలయానికి పిలిపించి సూపరింటెండెంట్ జంగయ్యతో కలిసి మరీ బెదిరింపులకు దిగడం కలకలం రేపుతోంది. ఒకసారిగా సహనాన్ని కోల్పోయారు.

Read also: MJTEL ట్రస్ట్‌లో న్యాయం కోసం ప్రిన్స్ ఆజం జా పోరాటం

ఎంపీఓ ఉషాకిరణ్ వారిపై పరుష పదజాలం

తోటి రిపోర్టర్లు చెబుతున్న పట్టించుకోకుండా తన అక్కసును వెళ్లగక్కారు. సదరు వార్తా కథనం రావడానికి పంచాయతీ కార్యదర్శులే కారణమని, “మీరే కావాలని సమాచారం ఇచ్చి ఈ వార్త రాయించారు” అంటూ ఎంపీఓ ఉషాకిరణ్ వారిపై పరుష పదజాలంతో విరుచుకపడ్డారని మండల స్థాయి ప్రజవాణికి వచ్చిన ప్రజలు గుసగుసలాడుతున్నారు. కార్యాలయానికి వచ్చిన సెక్రెటరీలను పట్టుకుని చిందులు తొక్కడమే కాకుండా ఆఫీసు సబార్డినేట్ల పట్ల అత్యంత దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. తన లోపాలను సరిదిద్దుకోవాల్సింది పోయి సిబ్బందిని అనుమానిస్తూ నానా యాగి చేస్తుండటంతో కార్యాలయంలో పని చేసేందుకు ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు.

Ibrahimpatnam: తోటి సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేయడం

అధికార గర్వంతో పత్రికా ప్రతినిధులను, తోటి సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేయడంపై మండల వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్న సదరు అధికారిపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. ఇదే విషయమై బీఎస్పీ జిల్లా నాయకులు కొండ్రు రఘుపతి ప్రజావాణిలో ఆర్డీవో అనంత రెడ్డికి వినతి పత్రం అందజేశారు. మండల కార్యాలయానికి తాళం వేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలు ఎలా రావాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దాంతో అక్కడే ఉన్న మండల పరిషత్ సుపరింటెండెంట్ జంగయ్యను పిలిచి మాట్లాడారు. సాయంత్రం 6 తర్వాత గేటుకు తాళం వేసుకోవాలని, ఉదయం తీయాలని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.