IBomma: ఐ బొమ్మ రవి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

Read Time:  1 min
IBomma: ఐ బొమ్మ రవి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
FONT SIZE
GET APP

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా అనేక భాషల సినిమాలు, ఓటిటి కంటెంట్లను అధునాతన టెక్నాలజి ద్వారా పైరసీ చేసి ఏకంగా పైరసీ సామ్రాజ్యాన్ని నెలకొల్పి, పోలీసులకు పట్టుబడి రెండు నెలలుగా జైల్లో వున్న ఐ బొమ్మ నిర్వాహకుడు (IBomma) రవి బెయిల్ కోసం హై కోర్టును (High Court) ఆశ్రయించాడు. తనపై సిసిఎస్లో నమోదైన నాలుగు కేసులను కొట్టివేయాలని, తనకు వెంటనే బెయిల్ ఇవ్వాలని అతను హైకోర్టును వేడుకున్నాడు. పైరసీ సినిమాలను బెట్టింగ్ యాప్లకు అమ్ముకోవడం ద్వారా కోట్ల రూపాయలను సంపాంచిన రవి ఈ క్రమంలో బప్పం టివితో పాటు ఐ బొమ్మ వెబ్సైట్ను కూడా ప్రారంభించి పైరసీ సినిమాలను అందులో ఉచితంగా చూపడం తెలిసిందే.

Read Also: DGP Shivadhar Reddy: ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు

IBomma: ఐ బొమ్మ రవి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
The hearing on I Bomma Ravi’s bail petition has been adjourned.

దీంతో పాటు విదేశాల్లో ఆస్తులు సంపాదించి, భారత పౌరసత్వం వదులుకుని కరేబియన్ దీవుల పౌరసత్వం పొందాడు. తన నేర సామ్రాజ్యాన్ని కరేబియన్ దీవుల నుంచి కొనసాగించేవాడు. రెండేళ్లకు పైగా సినీ రంగాన్ని తీవ్రంగా నష్టపరిచిన ఐ బొమ్మ (IBomma) రవిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పక్కాగా వ్యూహం పన్ని అరెస్టు చేయడం విదితమే. ఇతనికి బెయిల్ ఇస్తే విదేశాలకు పారిపోయి మళ్లీ రాడని పోలీసుల తరపున బలంగా వాదించడంతో ఇప్పటి వరకు బెయిల్ లభించలేదు.

రవిపై మొత్తం నాలుగు కేసులను సిసిఎస్, సైబర్ క్రైం పోలీసు స్టేషన్లో నమోదయ్యింది. నాంపల్లి కోర్టులో రవి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు వరుసగా డిస్మిస్ అవడంతో అతను మంగళవారం నాడు హైకోర్టులో బెయిల్ కోసం తన న్యాయవాది ద్వారా పిటిషన్ దాఖలు చేయించాడు. ఈ పి టిషన్ ను విచారించిన హైకోర్టు పోలీసులకు నోటీసులు జారీ చేసి దీనిపై తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.