పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ(iBomma Case) నిర్వాహకుడు రవిని మరో కేసులో నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. సైబర్ క్రైమ్ విభాగం అధికారులు ఆయనను ఈరోజు కోర్టు ముందు హాజరుపర్చగా, రెండో కేసులో రిమాండ్ విధించారు. రవిపై ఇప్పటివరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు.
Read Also: IBOMMA: పోలీస్ డిపార్ట్మెంట్‌లో రవికి ఉద్యోగం ఇవ్వాలి – CVL నరసింహారావు
రవిని ఐదు రోజుల పోలీసు కస్టడీలో
ఇవాళ హాజరైన కేసు కాకుండా మిగిలిన మూడు కేసులకు కూడా పీటీ వారెంట్(Warrant) కోసం పోలీసులు కోర్టును ఆశ్రయించారు. అనుమతి లభించిన తర్వాత ఆయా కేసుల్లో కూడా అధికారికంగా అరెస్టు(arrest) నమోదు చేయనున్నారు. ఇదివరకు రవిని ఐదు రోజుల పోలీసు కస్టడీలో ఉంచి విచారించిన అధికారులు, ఆ సమయంలో పలుకీలక వివరాలు బయటపడ్డాయని సమాచారం.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: