हिन्दी | Epaper

IAS Transfers in Telangana: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల భారీ బదిలీ

Tejaswini Y
IAS Transfers in Telangana: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల భారీ బదిలీ

IAS Transfers in Telangana: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనా యంత్రాంగంలో కీలక మార్పులు చేపట్టింది. పరిపాలనా సౌలభ్యం కోసం ఏకంగా 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

Read Also: Greenfield Highway: మే నెలలో ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రారంభం!

IAS Transfers in Telangana: Massive transfer of IAS officers in Telangana
IAS Transfers in Telangana: Massive transfer of IAS officers in Telangana

కీలక నియామకాలు – బాధ్యతలు

  • రాహుల్ బొజ్జా: సాధారణ పరిపాలన శాఖ(GDA) ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. దీనితో పాటు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.
  • దాన కిషోర్: రెవెన్యూ మరియు విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు.
  • సంజయ్ కుమార్: పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియామకం.
  • గౌరవ్ ఉప్పల్: ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ విభాగం కార్యదర్శిగా బదిలీ అయ్యారు.

డిస్కమ్ సీఎండీలు మరియు కలెక్టర్ల మార్పు

ముషారఫ్ అలీ ఫారూఖీని TGSPDCL నుంచి కొత్తగా ఏర్పాటు చేయబోతున్న 3వ డిస్కమ్ సీఎండీగా బదిలీ చేయగా, జితేష్ వి. పాటిల్ TGSPDCL కొత్త సీఎండీగా నియమితులయ్యారు. యాదాద్రి భువనగిరి కలెక్టర్‌గా ఉన్న ఎం. హనుమంతరావును దేవాదాయ శాఖ డైరెక్టర్‌గా నియమిస్తూ, గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. అలాగే నారాయణపేట కలెక్టర్ సిక్త పట్నాయక్ ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీ అయ్యారు.

ఇతర ముఖ్య నియామకాలు

ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా డి. దివ్యను ప్రభుత్వం నియమించింది. దేవాదాయ శాఖ కమిషనర్‌గా ఎం. హనుమంతరావు బాధ్యతలు చేపట్టనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870