📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

IAS Sivashankar – తెలంగాణ కేడర్ నుండి ఐఎఎస్ శివశంకర్ రిలీవ్

Author Icon By Rajitha
Updated: September 4, 2025 • 1:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : ఎట్టకేలకు తెలంగాణ కేడర్ నుండి ఐఏఎస్ అధికారి లోతేటి శివశంకర్ (IAS Sivashankar) రిలీవ్ అయ్యారు. తదుపరి ఏపీ కేడరుకు బదిలీ అయ్యారు. మరోపక్క శివశంకర్ను ఎపి కేడర్కు పంపాల్సిందిగా పరిపాలనా ట్రైబ్యునల్, తెలంగాణ (Telangana) హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లాలని భావించిన కేంద్రానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. హైకోర్టు ఆదేశాలు అమల్లో ఉన్న నేపథ్యంలో క్యాట్ ఉత్తర్వుల మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఎట్టకేలకు దిగివచ్చి శివశంకర్ను తెలంగాణ కేడర్ నుంచి రిలీవ్ చేసి, ఆంధ్రప్రదేశ్ కేడర్కు పంపేందుకు అంగీకరించింది.

ఈ మేరకు ఆయనను వెంటనే రిలీవ్ చేయాల్సిందిగా

ఈ మేరకు ఆయనను వెంటనే రిలీవ్ చేయాల్సిందిగా తెలంగాణ సీఎస్ రామకృష్ణా రావుకు క్యాట్ నుంచి ఆదేశాలు అందాయి. దీంతో బుధవారం శివశంకర్ను తెలంగాణ సర్కార్ రిలీవ్ చేసింది. కాగా, 2013కు చెందిన ఐఏఎస్ అధికారి లోతేటి శివశంకర్ ( Lotheti Sivashankar) స్వస్థలం విజయనగరం జిల్లాలోని ధర్మవరం. అయితే, ఆయన హైదరాబాద్లో ఉన్న తన మామయ్య ఇంట్లో ఉండి సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అయ్యారు. అదేవిధంగా యూపీఎస్సీ దరఖాస్తు ఫారంలో పర్మనెంట్ అడ్రస్ గా కూడా హైదరాబాదే ఇచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో కేడర్ నిర్ణయించేటప్పుడు చిరునామా ఆధారంగా శివశంకర్ను తెలంగాణకు కేటాయించారు.

సిఫారసు మేరకు

అయితే, ఆ నిర్ణయాన్ని ఆయన సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం స్టే ఇచ్చింది. ఆయన ఏపీ క్యాడర్లో గత 11 ఏళ్లు పని చేశారని దీపక్ ఖండేకర్ ఆధ్వర్యంలోని ఏకసభ్య కమిషన్ సిఫారసు మేరకు శివశంకర్ను తెలంగాణకుపంపారు. ఇదే విషయంపై శివశంకర్ క్యాట్ను ఆశ్రయించగా, గతేడాది ఫిబ్ర వరి 28న ఆయనకు అనుకూలంగా తీర్పువచ్చింది.క్యాట్ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ డీవోపీటీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయించగా హైకోర్టు కూడా క్యాట్ ఉత్తర్వులనే సమర్థిస్తూ జులై 3 న తుది తీర్పును వెలువరించింది.

Read hindi news : hindi.vaartha.com

Read also :

https://vaartha.com/hyderabad-wines-to-remain-closed-for-two-days-in-hyderabad/hyderabad/540757/

Andhra Pradesh cadre Breaking News cadre allocation dispute CAT verdict DoPT IAS officer transfer Lotheti Sivashankar Sivashankar IAS Telangana cadre Telangana High Court Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.