📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

Latest Telugu News: Syed Ali Murtaza Rizvi: మంత్రితో వివాదం..ఉద్యోగాన్నీ వదులుకున్న ఐఏఎస్ అధికారి

Author Icon By Vanipushpa
Updated: October 23, 2025 • 5:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ప్రభుత్వంలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య జరిగిన తీవ్ర వివాదం ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకు (వీఆర్ఎస్) దారితీసింది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో తలెత్తిన విభేదాల కారణంగా వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ(Syed Ali Murtaza Rizvi) బుధవారం తన పదవికి వీఆర్ఎస్ తీసుకున్నారు. నిజాయతీపరుడైన అధికారిగా పేరున్న రిజ్వీ, వ్యక్తిగత కారణాలతోనే పదవీ విరమణ చేస్తున్నట్లు పేర్కొన్నప్పటికీ, దీని వెనుక లిక్కర్ హోలోగ్రామ్ టెండర్ల వివాదం ఉన్నట్లు స్పష్టమవుతోంది.

Read Also: Market yards : మార్కెట్ యార్డులు రైతులకిచ్చే భరోసా ఎంత?

Syed Ali Murtaza Rizvi

రఘునందన్ రావుకు అదనపు బాధ్యతలు

మద్యం సీసాలపై అతికించే హై-సెక్యూరిటీ హోలోగ్రామ్‌ల టెండర్ల ప్రక్రియను రిజ్వీ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. దీనివల్ల పాత వెండర్‌కే ప్రయోజనం చేకూరిందని ఆయన విమర్శించారు. ఈ వ్యవహారంలో రిజ్వీ తీరు తీవ్ర తప్పిదమని, క్రిమినల్ చర్యలకు ఆస్కారం ఉందని పేర్కొంటూ, ఆయన వీఆర్ఎస్ దరఖాస్తును తిరస్కరించాలని కోరుతూ మంత్రి జూపల్లి స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి (సీఎస్) బుధవారం లేఖ రాయడం కలకలం రేపింది. అయితే, ప్రభుత్వం మంత్రి అభ్యంతరాలను పక్కనపెట్టి రిజ్వీ వీఆర్ఎస్‌ను ఆమోదించింది. ఆయన స్థానంలో వాణిజ్య పన్నుల కమిషనర్ ఎం. రఘునందన్ రావుకు రెవెన్యూ (వాణిజ్య పన్నులు & ఎక్సైజ్) శాఖ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.

మంత్రిని కాదని నేరుగా ముఖ్యమంత్రికి ఫైలు

నకిలీ మద్యం, అక్రమ రవాణా, ఎక్సైజ్ పన్ను ఎగవేతను అరికట్టేందుకు హోలోగ్రామ్‌లు కీలకం. వీటి టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని గత ఏడాది ఆగస్టు నుంచే తాను రిజ్వీకి సూచిస్తున్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు. అయితే, సెప్టెంబర్‌లో రిజ్వీ టెండర్ల నిపుణుల కమిటీని పునర్‌వ్యవస్థీకరించాలని ప్రతిపాదించడమే కాకుండా, ఛైర్మన్‌ పదవి నుంచి తప్పుకున్నారు. ఈ ప్రతిపాదనను మంత్రి తిరస్కరించినా, రిజ్వీ ఆ ఫైలును మంత్రిని కాదని నేరుగా ముఖ్యమంత్రికి పంపడంతో వివాదం ముదిరింది.

అధికారులను వేధిస్తున్న ప్రభుత్వం: బీఆర్ఎస్

ఈ పరిణామంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు అవినీతి సొమ్ము పంపకాల విషయంలో గొడవ పడుతున్నారని, దానికి అధికారులు భాగస్వాములు కాకపోవడంతో వారిని వేధిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మంత్రి జూపల్లి చెప్పిన మాట వినలేదన్న కోపంతోనే రిజ్వీ వీఆర్ఎస్‌ను కూడా అడ్డుకోవాలని చూశారని ఆయన విమర్శించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also :

Bureaucracy Civil services Government Affairs IAS officer Latest News Breaking News Minister Dispute Political Controversy Resignation News Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.