Kavitha-Ranganath: హైదరాబాద్‌లో చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపు లక్ష్యంగా ఏర్పడిన హైడ్రా (HYDRAA) పనితీరుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
Read Also: Lizard in Hyderabad Biryani: వామ్మో బిర్యానీ లో బల్లి అంట!
హైడ్రా ఒక మహమ్మారి.. పేదలపై ప్రతాపమా?
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘హైడ్రా’ అనే ఒక కొత్త మహమ్మారి పుట్టుకొచ్చిందని కవిత విమర్శించారు. ఈ వ్యవస్థ పేద ప్రజల ఇళ్లను కబళిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పేదల ఇళ్లను కూల్చివేస్తూ, పెద్దల భవనాల విషయంలో హైడ్రా ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని ఆమె ఆరోపించారు.
అంతేకాకుండా ఈ భవన నిర్మాణాన్ని ఆపకపోతే అందులో ఉండేబోయే వారితో పాటు ఆ చుట్టుపక్కల ప్రజల ప్రాణాలకే ప్రమాదమని లేఖ రాయలేదా..? అని కవిత ప్రశ్నించారు. వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలను తాను సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరించారు. అప్పుడు రంగనాథ్, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైనా దూకి చావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు తన ధర్నాకు సంబంధించి హైడ్రా పెట్టిన వీడియోలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
లేదంటే కచ్చితంగా కోర్టుకు ఈడుస్తానని రంగనాథ్ ను కవిత హెచ్చరించారు.నిజం మాట్లాడే వాళ్లదే తప్పు అన్నట్టుగా వీడియోలు ఎడిట్ చేసి ఎదురుదాడి చేస్తారా..? అని కవిత ప్రశ్నించారు. ప్రభుత్వానికి బాకాలు ఊదే వాళ్లు కూడా తాను ప్రైవేట్ ప్రాపర్టీలో ధర్నా ఎందుకు చేస్తున్నానని ప్రశ్నిస్తున్నారని.. మూసీ ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు కాబట్టే బాధ్యతాయుతమైన సంస్థగా హైదరాబాద్ ను పరిరక్షించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: