📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Hydra: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

Author Icon By Pooja
Updated: November 2, 2025 • 4:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ విధానంతో వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. పేదలపై ఒక న్యాయం, ధనవంతులపై మరో న్యాయం జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. “ప్రభుత్వ భూముల పరిరక్షణ” పేరుతో హైడ్రా వ్యవస్థ పేదల ఇళ్లను మాత్రమే లక్ష్యంగా చేసుకుందని మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, కేసీఆర్ పదేళ్ల పాలనలో అభివృద్ధి నిర్మాణాలు మాత్రమే కనిపించాయని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చివేతలే(Hydra) ఎక్కువగా జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఆయన సచివాలయం, టీ-హబ్‌, వీ-హబ్‌, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌, 42 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు వంటి అభివృద్ధి కార్యక్రమాలను కేసీఆర్ పాలన విజయాలుగా గుర్తు చేశారు.

Hydra

Read Also: JublieeHills elections:ఎన్నికపై రాజకీయ వేడి – కేకే సర్వే సంచలన అంచనా

హైడ్రా చర్యలపై విమర్శలు:
హైడ్రా(Hydra) చర్యలు పేదలపైనే కేంద్రీకృతమై ఉన్నాయని కేటీఆర్(KTR) ఆరోపించారు. పెద్దల ఆక్రమణల విషయంలో మాత్రం ప్రభుత్వం మౌనం పాటిస్తోందని అన్నారు. మంత్రి పొంగులేటి ఇల్లు చెరువు ప్రాంతంలోనే నిర్మాణం అయినప్పటికీ దాన్ని కూల్చలేదని ప్రశ్నించారు. అదేవిధంగా, ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న మంత్రి వివేక్ నివాసం, ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డి ఇళ్లపై హైడ్రా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. గాజులరామారంలో పేదల ఇళ్లు కూల్చిన హైడ్రా, అదే ప్రాంతంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ స్థలం జోలికి వెళ్లలేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే, హైడ్రా చర్యల వల్ల నష్టపోయిన వారికి న్యాయం చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

CongressGovernment HydraDemolitions Latest News in Telugu TelanganaPolitics Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.