HYDRA DRF rescue : హైదరాబాద్ పాతబస్తీలోని మిరాలం చెరువులో అర్ధరాత్రి వేళ చిక్కుకుపోయిన 9 మంది ఇంజనీర్లు, కార్మికులను హైడ్రా–డీఆర్ఎఫ్ బృందాలు సాహసోపేతంగా కాపాడాయి. ఆదివారం రాత్రి బోటు ఇంజన్ అకస్మాత్తుగా మొరాయించడంతో చెరువు మధ్యలోనే వారు చిక్కుకుపోయారు. జూ పార్కు సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర ఉత్కంఠను రేపింది.
చెరువులో నిర్మించనున్న వంతెన కోసం సాయిల్ టెస్టింగ్ పనులు పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా, చీకటి పడే సమయానికి బోటు నిలిచిపోయింది. దట్టంగా పెరిగిన గుర్రపు డెక్క కారణంగా బోటును ముందుకు నడపలేకపోయారు. (HYDRA DRF rescue) చుట్టూ చిమ్మచీకటి, మరోవైపు చెరువులో మొసళ్లు ఉన్నాయన్న భయంతో వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. వెంటనే డయల్ 100కు సమాచారం అందించడంతో పోలీసులు డీఆర్ఎఫ్‌కు సమాచారం ఇచ్చారు.
Read Also:Telangana: ఫ్లాగ్ హోస్టింగ్ సమయంలో అపశృతి
సమాచారం అందుకున్న వెంటనే హైడ్రా–డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఫోన్‌లో బాధితులకు ధైర్యం చెబుతూ, సెల్‌ఫోన్ లైట్ల సాయంతో వారి స్థానాన్ని గుర్తించారు. తీవ్ర అడ్డంకుల మధ్య రెండు విడతల్లో మొదట నలుగురిని, అనంతరం మిగిలిన ఐదుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ కార్మికులు హైడ్రా–డీఆర్ఎఫ్ సిబ్బందికి కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: