📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Hydra: రహదారులు నీటమునగకుండా అన్ని శాఖలతో సమన్వయం: హైడ్రా కమిషనర్ ఎ.వి రంగనాథ్

Author Icon By Sharanya
Updated: June 25, 2025 • 11:09 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: రహదారులు నీట మునగకుండా చూడడమే అందరి లక్ష్యం కావాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ – అన్నారు. సమస్య ఎలా పరిష్కారం అవుతుందనే అంశంపై స్పష్టమైన అవగాహన ఉండాలని సూచించారు. ఇందుకు సంబంధించిన – శాఖలన్నీ సమన్వయంతో పని చేస్తే సమస్యను చాలా వరకు పరిష్కారం చేయగలమన్నారు. ఈ – క్రమంలో ఇప్పటికే జీహెచ్ ఎంసీతో కలసి పని చేస్తున్న హైడ్రా ట్రాఫిక్ పోలీసు ఉన్నతాదికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసింది. జాయింట్ సీపీలు గజరావు భూపాల్, జోయిల్ డేవిస్, హైడ్రా అడిషనల్ – డైరెక్టర్ వి. పాపారావుతో పాటు హైడ్రా, ట్రాఫిక్ పోలీసు విభాగాలకు సంబంధించిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

వరద ముప్పు ప్రభావం

ముందుగా వరద నీట మునిగిన ప్రాంతాలలో తలెత్తుతున్న సమస్యలను అధికారులు వివరించారు. రెండు గంటల పాటు వర్షం పడితే ఒక మీటరు ఎత్తున నీరు చెరువుల్లో చేరుతోందని ఇంతే మొత్తం వాటర్ బయటకు వెళ్లాలంటే వారం రోజులు పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో వరదను నిలువరించే చెరువుల నీటి మట్టంపైనా అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని హైడ్రా కమిషనర్ సూచించారు, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిష నరేట్ల పరిధిలో మొత్తం 349 ప్రాంతాలలో వరద ముప్పు ఉందని గుర్తించారు. వర్షం సమాచారం తెలియగానే ఈ ప్రాంతాలలో సంబంధిత శాఖల అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ సూచించారు. ఈ ప్రాంతాలకు దగ్గరలో చెరువులు, నాలాలు అనుసంధానమై ఉన్నాయా లేదా అనేది పరిశీలించాల న్నారు. వరద కాలువలు ఎక్కడైనా కుంచించుకుపోయినా, పూడుకు పోయినా ఆసమాచారం ఇస్తే వెంటనే పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్లోని ప్యాట్నీ, చికోటీ గార్డెన్స్, చింతల బస్తీల మీదుగా సాగే వరద కాలువలను విస్తరి స్తున్నామని చెప్పారు. చెరువులు, నాలాలు కబ్జాకు గురైతే వెంటనే తొలగించాలని కోర్టులు స్పష్టమైన తీర్పులు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

3రోజుల్లో మాన్సూన్ ఎమర్జన్సీ బృందాలు:

51 హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలకు 150 మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్లు కూడా తోడవుతున్నాయని రంగనాథ్ చెప్పారు. సర్కిళ్ల వారీ జీహెచ్ ఎంసీ సిబ్బందితో కలిసి ఈ బృందాలు పని చేస్తాయన్నారు. వీటికి జలమం డలి, ట్రాఫిక్, ఇరిగేషన్, విద్యుత్ శాఖలకు చెందిన సిబ్బంది కూడా తోడయితే.. నగరానికి వరద ముప్పు చాలావరకు తగ్గించవచ్చునన్నారు. 50 మేజర్ సమస్య ఉన్న ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారానికి తొలుత ప్రయత్నిద్దామన్నారు. వర్ష సమచారంతో పాటు సమస్యల పరిష్కా రానికి తీసుకునే చర్యలు సమన్వయంతో సాగేందుకు వీలుగా వాట్సాప్ గ్రూప్లను ఏర్పా టు చేయాలని సూచించారు. బ్రేక్ డౌన్ అవు తున్న వాహనాలను పక్కకు తీయడానికి తగిన వాహనాలను ప్రాంతాల వారీ సమకూర్చుకో వాలని ట్రాఫిక్ విభాగం జాయింట్ సీపీలు కోరారు. నగరంలో ఏప్రాంతాల్లో వరద ముప్పు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయో వివరించారు.

Read also: DEECET-2025: 28 నుంచి డిఇఇసెట్-2025 రెండో విడత కౌన్సెలింగ్

#CommissionerRanganath #FloodFreeHyderabad #GHMCUpdates #Hyderabad #HYDRA #HydTraffic #UrbanSafety Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.