AV Ranganath Political Entry: రాజకీయాల్లోకి ఏవీ రంగనాథ్? ప్రచారంపై హైడ్రా కమిషనర్ క్లారిటీ!

Read Time:  1 min
hydra-commissioner-av-ranganath-clarity-on-political-entry-rumors
hydra-commissioner-av-ranganath-clarity-on-political-entry-rumors
FONT SIZE
GET APP

AV Ranganath Political Entry: తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ‘హైడ్రా’ (HYDRA) కూల్చివేతలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ఒకవైపు బాధితుల నుంచి విమర్శలు ఎదురవుతుండగా, మరోవైపు సామాన్య ప్రజల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Read Also: Begumpet Crime: బాల్కనీ స్లాబ్ కూలి తండ్రీకొడుకుల మృతి

hydra-commissioner-av-ranganath-clarity-on-political-entry-rumors
hydra-commissioner-av-ranganath-clarity-on-political-entry-rumors

రాజకీయ ఆరంగేట్రంపై ఏవీ రంగనాథ్ స్పందన

తన రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి వెళ్తానంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. తనకు ఇంకా ఐదేళ్ల సర్వీస్ ఉందని, ప్రస్తుతం తన దృష్టి అంతా విధి నిర్వహణపైనే ఉందని తెలిపారు. “మంచి పనులు చేసిన ప్రతి ఒక్కరూ రాజకీయాల్లోకి వెళ్తారని అనుకోవడం సరికాదు” అని ఆయన పేర్కొన్నారు. కేవలం బాధ్యతాయుతమైన అధికారిగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నానని ఆయన వివరించారు.

కులం, ఫేవరిజంపై కీలక వ్యాఖ్యలు

కాపు సంఘం సమావేశాల్లో పాల్గొనడంపై వస్తున్న విమర్శలకూ ఆయన బదులిచ్చారు. దేశంలో కులం అనేది ఒక వాస్తవమని, అయితే ‘కులపిచ్చి’ ఉండకూడదని తాను నమ్ముతానని చెప్పారు. “తమ కులం వ్యక్తి తప్పు చేసినా, పక్క కులం వ్యక్తి సరైన పని చేసినా.. ఏది ఒప్పో దానికే నేను మద్దతు ఇస్తాను. ఒక వ్యక్తి నా కులం వాడు కదా అని ఫేవర్ చేయడం నా డిక్షనరీలో లేదు” అని రంగనాథ్ తేల్చి చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.