📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

HYDRA: హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు

Author Icon By Pooja
Updated: December 25, 2025 • 11:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ ప్రజలకు హైడ్రా శుభవార్త అందించింది. సంక్రాంతి సందర్భంగా నిర్వహించే పతంగుల పండుగ కోసం నగరంలోని అభివృద్ధి చేసిన చెరువులను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెరువుల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు.

TG Assembly : 29 నుంచి శీతాకాల సమావేశాలు.. కీలక చర్చలకు సిద్ధం

HYDRA

హైడ్రా కమిషనర్ మాధాపూర్‌లోని తమ్మిడికుంట, కూకట్‌పల్లిలోని నల్ల చెరువులను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. చెరువుల్లోకి నేరుగా మురుగు నీరు చేరకుండా ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని మాత్రమే ప్రవేశపెట్టేలా తక్షణమే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఎస్టీపీలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు చెరువుల సమీపంలోని ప్రభుత్వ భూమిని వినియోగించుకోవాలని సూచించారు. చెరువుల చుట్టూ పార్కులు అభివృద్ధి చేసి గ్రీనరీ పెంచాలని, ప్రతి చెరువును ఒక పర్యాటక కేంద్రంలా తీర్చిదిద్దాలని అన్నారు.

భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యం

సీనియర్ సిటిజన్లు, చిన్నారుల కోసం ప్రత్యేక ప్లే ఏరియాలు ఏర్పాటు చేయాలని హైడ్రా కమిషనర్ సూచించారు. పతంగుల పండుగ ప్రశాంతంగా, ఆహ్లాదకర వాతావరణంలో జరగాలంటే జీహెచ్‌ఎంసీ, పర్యాటక శాఖతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం అవసరమన్నారు. చెరువుల వద్ద భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్ సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు.

నీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి

వర్షాకాలం ముగిసిన నేపథ్యంలో చెరువుల్లో నీటిని నిల్వ చేసేందుకు ఎస్టీపీలను త్వరగా ఏర్పాటు చేయాలని సూచించారు. మూసీ నది ప్రక్షాళన కొనసాగుతున్న సమయంలో, చెరువుల నుంచి శుద్ధి చేసిన నీరు మూసీలో చేరేలా ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లు నిర్మించడం ద్వారా పరిసర ప్రాంతాల నుంచి వర్షపు నీరు సులభంగా చెరువులోకి వచ్చేలా ఛానళ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు.

మునుపు మురుగు నీటితో నిండిపోయి ఆక్రమణలకు గురైన చెరువులను హైడ్రా అభివృద్ధి చేయడంతో అవి ఇప్పుడు పండుగల వేదికలుగా మారుతున్నాయి. ఇటీవల అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట బతుకమ్మ ఉత్సవాలకు వేదికగా నిలవగా, ఈసారి సంక్రాంతి సందర్భంగా బతుకమ్మ కుంటతో పాటు తమ్మిడికుంట, నల్ల చెరువు, పాతబస్తీలోని బమ్–రుక్న్–ఉద్–దౌలా చెరువులు పతంగుల పండుగకు వేదికలుగా మారనున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

Google News in Telugu hyderabad KiteFestival Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.