Revanth Reddy : గచ్చిబౌలి స్టేడియం పునర్నిర్మాణం- సీఎం రేవంత్ ఆదేశం

Read Time:  1 min
Revanth Reddy
Revanth Reddy
FONT SIZE
GET APP

Revanth Reddy : తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర క్రీడాకారులు ఒలింపిక్స్ వంటి మెగా ఈవెంట్లలో పతకాలు సాధించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు.

గచ్చిబౌలి స్టేడియం పునర్నిర్మాణం

జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో క్రీడాశాఖపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం గచ్చిబౌలి స్టేడియంను అంతర్జాతీయ ప్రమాణాలతో పునర్నిర్మించాలని సూచించారు. ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియాలతో పాటు యూనివర్సిటీ కాంప్లెక్స్, అత్యాధునిక హాస్టల్ భవనాలు, వివిధ క్రీడల శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలిపారు.

Read Also:Bangladesh: ఆగని హింస: పూజలు చేస్తున్న హిందువులపై బాంబు దాడి!

Revanth Reddy
Revanth Reddy

మెగా క్రీడలకు ఆతిథ్యం లక్ష్యం

భవిష్యత్తులో తెలంగాణ ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వగల స్థాయికి చేరుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఇప్పటినుంచే అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.

ఇతర స్టేడియాల ఆధునికీకరణ

గచ్చిబౌలి మాత్రమే కాకుండా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియాలను కూడా ఆధునికీకరించాలని నిర్ణయించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.