Kukatpally Robbery: హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో సంచలన దోపిడీ చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తుల కళ్లలో కారం చల్లిన దుండగులు, వారి వద్ద ఉన్న రూ. కోటి నగదును లాక్కొని పరారయ్యారు. ఈ ఘటన ఏకంగా ఏసీపీ కార్యాలయానికి సమీపంలోనే జరగడం తీవ్ర కలకలం రేపింది.
Read Also: Digital attacks : మితిమీరుతున్న ‘డిజిటల్ దాడులు.

కారం చల్లి నగదు లూటీ
బహదూర్‌పురాకు చెందిన ఎండీ ఖుస్రు (42), ఎండీ అజీముద్దీన్ (38) అనే ఇద్దరు ఏసీ మెకానిక్‌లు సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై జీడిమెట్లకు బయలుదేరారు. గోల్డ్ డ్రాప్ ఆయిల్ కార్టన్‌లో రూ. కోటి నగదును తీసుకెళ్తుండగా, కూకట్పల్లి మెట్రో పిల్లర్ నంబర్ 837 వద్ద నలుగురు దుండగులు వారిని అడ్డగించారు. వెంటనే వారి కళ్లలో కారం పొడి చల్లి, వారు తేరుకునేలోపే నగదు బాక్సును లాక్కొని పరారయ్యారు.
దాడిలో బాధితులకు గాయాలు కాలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దోపిడీ వెనుక హవాలా లావాదేవీలు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: