LPG supply issue : హైదరాబాద్‌లో హోటల్స్ బంద్? LPGపై కేంద్రం క్లారిటీ

Read Time:  1 min
LPG supply issue
LPG supply issue
FONT SIZE
GET APP

LPG supply issue : పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో LPG కొరత ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. హైదరాబాద్‌లో కూడా కొన్ని హోటళ్లు తాత్కాలికంగా మూసివేయనున్నట్లు సమాచారం వెలువడింది.

గ్యాస్ కొరతపై హోటల్ యజమానుల ఆందోళన

హోటల్ యజమానుల ప్రకారం రోజువారీగా ఒక హోటల్‌కు సగటున 15 నుంచి 20 గ్యాస్ సిలిండర్ల అవసరం ఉంటుంది. అయితే ఇటీవల సరఫరాలో ఆలస్యం జరుగుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని రోజుల వరకు నిల్వలున్నాయని, పరిస్థితి మారకపోతే హోటళ్లను మూసివేయాల్సి వస్తుందని చెబుతున్నారు.

Read Also: Sakala Janula Samme: కేసీఆర్, కేటీఆర్‌‌పై నమోదైన కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు

LPG supply issue
LPG supply issue

కేంద్రం క్లారిటీ

ఈ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వర్గాలు కీలక ప్రకటన చేశాయి. దేశంలో LPG కొరత లేదని స్పష్టం చేశాయి. గ్యాస్ సరఫరా వ్యవస్థను స్థిరీకరించామని తెలిపాయి.

ఉత్పత్తి పెంపు

ప్రభుత్వ ఆదేశాల మేరకు రిఫైనరీలు LPG ఉత్పత్తిని సుమారు 10 శాతం వరకు పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. కృత్రిమ కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.