అగ్రరాజ్యం అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఏర్పడిన ఎల్‌పీజీ (LPG) సంక్షోభం భారతదేశంలోని అనేక రంగాలను ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా హోటల్, రెస్టారెంట్ పరిశ్రమపై ఈ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. హైదరాబాద్ నగరంలో గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న తినుబండారాల వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హైదరాబాద్(Hyderabad)లో సుమారు 70 వేలకు పైగా హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న ఫుడ్ అవుట్‌లెట్లు ఉన్నాయి. సాధారణంగా ఈ రంగం నగర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇటీవల ఏర్పడిన ఎల్‌పీజీ సరఫరా సంక్షోభం కారణంగా ఈ రంగం తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం.. గత రెండు రోజుల్లోనే ఈ రంగం దాదాపు రూ.50 కోట్ల వరకు నష్టాన్ని చవిచూసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రోజుకు సుమారు రూ.100 కోట్ల వరకు నష్టం కలగవచ్చని అంచనా వేస్తున్నారు.
Read Also: DK Shivakumar : మా ఎమ్మెల్యేలకు రూ.5 కోట్లు ఆఫర్ చేశారని, డీకే సంచలన ఆరోపణలు
రెస్టారెంట్లపై అదనపు ఆర్థిక భారం
కొంతమంది యజమానులు గ్యాస్ వినియోగం తక్కువగా ఉండే వంటకాలను మాత్రమే మెనూలో ఉంచుతున్నారు. దీని వల్ల వినియోగదారులకు అందుబాటులో ఉండే వంటకాల ఎంపిక కూడా తగ్గింది. మరోవైపు చిన్న తినుబండారాలు, రోడ్డు పక్కన ఉన్న ఫుడ్ స్టాళ్లు కొంతకాలం పాటు తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఎల్‌పీజీ ధరలు కూడా ఇటీవల పెరగడంతో రెస్టారెంట్లపై అదనపు ఆర్థిక భారంగా మారింది. దీంతో కొన్ని హోటళ్లు భోజనం, టిఫిన్, ఇతర వంటకాల ధరలను పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. దీని ప్రభావం వినియోగదారులపై కూడా పడుతోంది. ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభం మాత్రమే ఎందుకు.. పెట్రోల్, డీజిల్ ఎందుకు ప్రభావితం కాలేదు? ఈ పరిస్థితిపై నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) స్పందించింది. ఎల్‌పీజీ సరఫరాలో అంతరాయం కారణంగా చిన్న తినుబండారాల నుంచి పెద్ద హోటళ్ల వరకు అన్ని స్థాయిల వ్యాపారాలు ప్రభావితమవుతున్నాయని సంఘం తెలిపింది. బిర్యానీ లేదా బియ్యం ఆధారిత వంటకాలను కట్టెలతో వండే అవకాశం ఉన్నప్పటికీ, కూరలు, స్టార్టర్లు, స్నాక్స్ లేదా బ్రెడ్ వంటి వంటకాలకు అది సాధ్యపడదని వారు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: