News Telugu: Global Summit 2025: గ్లోబల్ సమ్మిట్ ప్రముఖులకు ‘రోబో’ ఆహ్వానం

Read Time:  1 min
Global Summit 2025
Global Summit 2025
FONT SIZE
GET APP

Global Summit 2025: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఫ్యూచర్ సిటీలో “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025” ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభమైంది. ఈ సదస్సును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, సినీ నటుడు నాగార్జున, దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రముఖులను ‘రోబో’ ద్వారా ఆహ్వానించడం హాజరైన అందరినీ ఆకట్టుకుంది.

Read also: HYD: ఒక్క రూపాయికే టిఫిన్.. ఎక్కడో తెలుసా?

Global Summit 2025

Global Summit 2025

44 దేశాల నుండి 154 మంది ప్రతినిధులు

Global Summit 2025: 100 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతున్న ఈ సదస్సు రెండు రోజుల పాటు కొనసాగుతుంది. 44 దేశాల నుండి 154 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదస్సు ప్రాంగణంలోని స్టాళ్లను పరిశీలించి, వివిధ అంశాలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. సదస్సులో తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహంను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సదస్సులో తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు, ప్రజా పాలన, ప్రభుత్వం అందించే సహకారం, “విజన్ 2047” డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ వంటి అంశాలను వివరించనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.