Breaking News: Chevella Accident: ప్రమాదం జరగడానికి గల కారణాలు?

Read Time:  1 min
Chevella Accident
Chevella Accident
FONT SIZE
GET APP

రంగారెడ్డి జిల్లాలో మరోసారి భయంకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చేవెళ్ల(Chevella Accident) మండలం మీర్జాగూడ సమీపంలో కంకరతో నిండిన టిప్పర్ లారీ వేగంగా దూసుకువచ్చి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 24 మంది ప్రాణాలు కోల్పోగా, 20మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 9:30 గంటల సమయంలో చేవెళ్ల–వికారాబాద్(Vikarabad) రహదారిపై ఈ ఘటన జరిగింది.

Chevella Accident

Read Also: Chevella Accident: కంకర బరువే ప్రాణాంతకం

ప్రమాదానికి కారణాలుగా పోలీసులు నాలుగు అంశాలను గుర్తించారు:

1. డ్రైవర్ నిర్లక్ష్యం:
కంకరతో లోడైన టిప్పర్ లారీని అతివేగంగా నడపడం ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. వేగ నియంత్రణ లేకుండా దూసుకెళ్లడం వల్ల వాహనం అదుపు తప్పినట్లు తెలుస్తోంది.

2. రాంగ్ రూట్ ప్రయాణం:
టిప్పర్ లారీ తప్పు దారిలో ప్రయాణించడంతో ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టినట్లు సాక్షులు చెబుతున్నారు. తప్పు మార్గంలో రావడం వల్ల ఢీకొట్టే ప్రమాదం తప్పలేదని అధికారులు తెలిపారు.

3. ఇరుకైన రహదారి:
ప్రమాదం జరిగిన NH-163 (హైదరాబాద్–బీజాపూర్ రహదారి)(Chevella Accident) ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రెండు లేన్ల రోడ్డుగా ఉంది. రోడ్డు విస్తరణ పనులు ఆలస్యం కావడంతో భారీ వాహనాలు ఎదురెదురుగా వస్తున్నప్పుడు డ్రైవర్లకు అంచనా వేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇది కూడా ప్రమాదాలకు దారితీస్తోందని స్థానికులు చెబుతున్నారు.

4. కంకర లోడ్ ప్రభావం:
టిప్పర్‌లో భారీగా కంకర ఉండటం ప్రమాద తీవ్రతను మరింత పెంచింది. ఢీ కొట్టిన వెంటనే కంకర మొత్తం బస్సులోకి దూసుకెళ్లి ప్రయాణికులను మట్టిలో ముంచేసింది. దాంతో ఊపిరాడక పలువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ దుర్ఘటన రాష్ట్రాన్ని విషాదంలో ముంచగా, అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఘటనపై సమగ్ర నివేదిక కోరింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.