Burgula PHC: బూర్గుల వైద్యుడిగా రఘురాం

Read Time:  1 min
Burgula PHC
Burgula PHC
FONT SIZE
GET APP

ఇర్విన్ ఆరోగ్య కేంద్రానికి బూర్గుల డాక్టర్ రాఘవేందర్

Burgula PHC: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం బూర్గుల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ రాఘవేందర్ ఎట్టకేలకు బదిలీ అయ్యారు. మూడు వారాల క్రితమే రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని బదిలీ ఉత్తర్వులు పంపగా, మూడు వారాలుగా బదిలీ ఉత్తర్వులు తీసుకోకుండా రిలీవ్ కాకుండా డాక్టర్ రాఘవేందర్ కాలయాపన చేశారు. ఈ వ్యవహారంపై వార్త దినపత్రికలో “వదల బొమ్మాలి” అంటూ డాక్టర్ రాఘవేందర్ బదిలీ వ్యవహారంపై ఈ కథనం రూపొందించబడింది. ఎట్టకేలకు డాక్టర్ రాఘవేందర్ జిల్లాలోని ఇర్విన్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుడిగా రిపోర్ట్ చేశారు.

Read Also:Dundigal: రెండు నెలల పసికందును కట్టెల పొయ్యిలో వేసి చంపిన కన్నతల్లి

ఆయన స్థానంలో ఫరూక్ నగర్ మండలం బూర్గుల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రఘురాం రిపోర్ట్ చేశారు. ఎట్టకేలకు బూర్గుల ఆరోగ్య కేంద్రం వివాదం ముగిసింది. మంగళవారం వార్త దినపత్రికలో బూర్గుల ఆరోగ్య కేంద్రం బదిలీ వ్యవహారంపై కథనం రూపొందించగా జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. దీంతో డాక్టర్ రాఘవేందర్ రిలీవ్ అయ్యారు. ఆయన స్థానంలో డాక్టర్ రఘురాం వచ్చి చేరారు. మొత్తం బూర్గుల వివాదం లో ఒక సూపర్వైజర్ ఒక రెండవ ఏఎన్ఎం బదిలీ అయ్యారు. మొత్తానికి బూర్గుల వివాదం కథ సుఖాంతమైంది..

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.