AR Constable Sudheer Murder : కానిస్టేబుల్ దారుణ హత్య.. 8 గంటల్లోనే నిందితుల అరెస్ట్

Read Time:  1 min
AR Constable Sudheer Kumar Murder Chilukanagar
AR Constable Sudheer Kumar Murder Chilukanagar
FONT SIZE
GET APP

AR Constable Sudheer Murder: హైదరాబాద్ చిలుకనగర్‌లో వాట్సాప్ చాట్ వివాదంతో ఏఆర్ కానిస్టేబుల్ సుధీర్ కుమార్ దారుణ హత్యకు గురిఅయిన విషయం తెలిసిందే కదా. అయితే పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, సీసీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో కేవలం 8 గంటల్లోనే నలుగురు నిందితు లను అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన కత్తి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Hyderabad Crime: ఎఆర్ కానిస్టేబుల్ దారుణహత్య

వాట్సాప్ వివాదం నుండి హత్య వరకు..

పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన సుధీర్ (35) హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆయన చెంగిచర్లలోని ఆర్టీసీ కాలనీలో నివసిస్తున్నారు. చిలుకానగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ సంతోష్ నాయక్‌తో సుధీర్‌కు పాత స్నేహం ఉంది. శనివారం రాత్రి వీరిద్దరి మధ్య వాట్సాప్‌లో చాటింగ్ జరుగుతుండగా మాటామాట పెరిగింది. “నువ్వెంత అంటే నువ్వెంత” అని పరస్పరం దూషించుకున్నారు.

AR Constable Sudheer Murder
Brutal murder of a constable.. Accused arrested within 8 hours

AR Constable Sudheer Murder: స్మశానవాటిక వద్ద దాడి

ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో ఈ వివాదాన్ని తేల్చుకోవడానికి చిలుకానగర్ ఆదర్శనగర్ లోని స్మశానవాటిక ఖాళీ స్థలం వద్ద కలుసుకున్నారు. సుధీర్ తన స్నేహితుడు ఇమ్రాన్ ఖాన్‌తో కలిసి అక్కడికి వెళ్లారు. అప్పటికే పథకం ప్రకారం కత్తితో వేచి ఉన్న సంతోష్ నాయక్, సుధీర్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ప్రాణభయంతో సుధీర్, ఇమ్రాన్ పరుగులు తీసినప్పటికీ, సాయిబాబా ఆలయ సమీపంలో సుధీర్ కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

8 గంటల్లోనే నిందితుల అరెస్ట్

ఈ దారుణ ఘటనపై ఉప్పల్ పోలీసులు యుద్ధ ప్రాతిపదికన దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సాయంతో కేవలం 8 గంటల వ్యవధిలోనే ప్రధాన నిందితుడు సంతోష్ నాయక్‌తో పాటు మరో ముగ్గురిని (మొత్తం నలుగురు) అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. చిన్నపాటి అహానికి ఒక నిండు ప్రాణం బలవ్వడం స్థానికంగా విషాదం నింపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Siva Prasad

రచయిత గురించి

Siva Prasad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.