Adulterated Curd: హైదరాబాద్‌లో కల్తీ పెరుగు దందా.. 2,500 కిలోలు స్వాధీనం

Read Time:  1 min
Adulterated Curd: హైదరాబాద్‌లో కల్తీ పెరుగు దందా.. 2,500 కిలోలు స్వాధీనం
FONT SIZE
GET APP

Adulterated Curd: హైదరాబాద్ నగరంలో కల్తీ రాయుళ్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఇప్పటికే కల్తీ నెయ్యి వార్తలు కలకలం రేపగా, తాజాగా అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఎత్తున కల్తీ పెరుగు నిల్వలను అధికారులు పట్టుకున్నారు. సుమారు 2,500 కిలోల కల్తీ పెరుగును స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Pratima Singh: ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలి

Adulterated Curd: Adulterated curd racket in Hyderabad.. 2,500 kg seized
Adulterated Curd: Adulterated curd racket in Hyderabad.. 2,500 kg seized

కాస్టిక్ సోడాతో ప్రమాదకరమైన తయారీ

పాలలో కాస్టిక్ సోడాను వినియోగించి ఈ కల్తీ పెరుగును తయారు చేస్తున్నట్లు తనిఖీల్లో అధికారులు గుర్తించారు. అంబర్‌పేట పోలీసులు, ఖైరతాబాద్ టాస్క్‌ఫోర్స్, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కలిసి తనిఖీలు చేపట్టారు. శాంపిళ్లను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు.

వేడి పాలలో కాస్టిక్ సోడాను వేస్తే అది పెరుగుగా మారుతుంది. ఈ పెరుగును తింటే అనారోగ్యానికి గురవుతారని సంబంధిత అధికారులు వెల్లడించారు. కల్తీ పెరుగు గురించి సమాచారం రాగానే అధికారులు గోడౌన్‌పై దాడి చేశారు. ఈ పెరుగును వివిధ హోటళ్లు, ఫంక్షన్‌లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.