📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్

Hyderabad: భారీగా పెరిగిన కూరగాయల ధరలు

Author Icon By Tejaswini Y
Updated: December 31, 2025 • 11:08 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కిలో రూ.80 నుండి 100కు చేరిన రేటు

చలి తీవ్రతతో 70 శాతం తగ్గిన దిగుబడి

Hyderabad : ప్రస్తుత వాతావరణం కూరగాయల తోటలకు ప్రతికూలంగా మారింది. ఈసారి ఉత్తరాది ప్రాంతాలను తలిపించే విధంగా చలి పంజా విసురుతోంది. ఈ చలి తీవ్రతతో దిగుబడి తగ్గడంతో డిమాండ్కు సరిపడా లేక రాష్ట్రంలో కూరగాయల ధరలు(Vegetable Prices) భారీగా పెరిగాయి. సాధారణంగా కూరగాయలు అధికంగా పండే ఈ సీజన్లో రూ.50 నుంచి రూ.60కు కిలో దొరికేవి. దిగుబడి తగ్గిపోవడంతో ప్రస్తుతం మార్కెట్లో ఏ కూరగాయలైనా కిలో రూ.80 పైబడి సెంచరీ ధర పలుకుతున్నాయి. ఆకు కూరలకు కూడా రూ.60 నుంచి రూ.80 వెచ్చించాల్సి రావడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు.

Read Also: Hyderabad: క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్

మార్కెట్లో వినియోగదారులకు ఒక్కో రోజుకు కనీసం రూ.200 వెచ్చిస్తే తప్ప కూరగాయల(Vegetable Prices) అవసరాలు తీరడం లేదు. సాధారణంగా ఈ సీజన్లో అన్ని కూరల్లో వాడే టమాట కిలో రూ.20 నుంచి రూ.30 మించేది కాదు. బీర, బెండ, కాకర, చిక్కుడు కూరగాయలు అన్నీ ఇప్పుడు రూ.80 నుండి రూ.100కు పైగా అమ్మతున్నారు. ఒక్కో సోరకాయ ధర రూ.40, పచ్చిమిర్చి రూ.100 కు కిలో అమ్ముతున్నారు. దిగుబడి కాగా చలి కారణంగా పిందె దశలోనే రాలి పోవడం, ఆకులు నల్లబడి పోవడం, పూత రాలిపోవడంతో కూరగాయల తగ్గుతున్నది. మొక్కల ఆకులు పెలుసుబారి నల్లబడి దిగుబడి తగ్గిపోతున్నది. ప్రతీ సీజన్లో ఎకరానికి 15 టన్నుల కూరగాయల దిగుబడి వస్తుంటాయి. అయితే ప్రస్తుతం చలి తీవ్రత అధికంగా ఉండడంతో ఎకరాకు మూడు టన్నుల నుంచి నాలుగు టన్నుల దిగుబడి మాత్రమే వస్తుంది.

చలి అధికంగా ఉండడంతో 70 శాతం దిగుబడి తగ్గింది. ఎకరం పొలంలో బీర పంట సాగు చేస్తే రోజు తప్పించి రోజు క్వింటాల్ కన్నా ఎక్కువే కోతకు వచ్చేవని రైతులు అంటున్నారు. ఇప్పుడు 50 కిలోలు మాత్రమే వస్తున్నాయని, 200 వరకూ వచ్చే సోరకాయలు చలి తీవ్రతతో ఇప్పుడు 80 వస్తున్నాయని చెబుతున్నారు. అలాగే టమాట వారానికి 50 బాక్సులు వస్తుండగా, ప్రస్తుతం 20 బాక్సులు రావడం కష్టంగానే ఉందని వాపోతున్నారు. చలికి పొగమంచు(Winter Effect) మిర్చి, బెండ, కాకర, బీర, కీరదోస ఆకుల మీద పడడంతో మొక్కలకు భూమినుంచి పోషకాలు తగిన మోతాదులో అందడంలేదు. దీంతో మొక్కల ఎదుగుదల నిలిచిపోయిందని రైతులు ఆందోళన చెందు తున్నారు. ఇలా దిగుబడి తగ్గడంతో కొన్నిచోట్ల కూరగాయల పంటను పూర్తిగా తీసివేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

hyderabad Telangana agriculture tomato price hike Vegetable Prices Vegetable Yield Decline Winter Effect

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.