Hyderabad : ఎఐసీసీ పిలుపుమేరకు శుక్రవారం హైదరాబాదులో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని నిరసిస్తూ పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాద నిర్మూలనలో కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. 1971లో ఇందిరాగాంధీ ఇచ్చిన గట్టి ప్రతిస్పందనను గుర్తు చేస్తూ, అప్పట్లో ఆమె ఒక్క దెబ్బతో పాకిస్తాన్‌ను విడగొట్టి బంగ్లాదేశ్‌ను ఆవిష్కరించారని గుర్తుచేశారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఉగ్రవాదంపై గట్టి జవాబు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత దేశంలో కలపాలని సూచించారు. పహల్గాంలో భారతీయ పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కేంద్రాన్ని కోరారు.
Hyderabad : ఉగ్రవాదంపై గట్టి స్పందనతో దేశ భద్రతకే ప్రాధాన్యం: సీఎం రేవంత్
దేశం అంతటా ఉగ్రవాదాన్ని వ్యతిరేకించేందుకు రాజకీయాలు, పార్టీ సిద్ధాంతాలను పక్కనపెట్టి ఒక్కటై పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. చనిపోయిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారికి అండగా నిలబడతామని ప్రకటించారు.ఈ ర్యాలీలో కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షిద్, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీ విజయశాంతి, వీహెచ్, దానం నాగేందర్, షబ్బీర్ అలీ, బల్మూరి వెంకట్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భారత్ సమ్మిట్‌కు వచ్చిన విదేశీ ప్రతినిధులు సైతం ఈ ర్యాలీలో పాల్గొని ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించారు.
Read More : Chandrababu : మత్స్యకారుల సేవలో.. నేడు అకౌంట్లలోకి రూ.20వేలు