📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Hyderabad: ప్రారంభానికి సిద్ధమైన మరో రెండు చెరువులు

Author Icon By Tejaswini Y
Updated: March 5, 2026 • 10:09 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Hyderabad: మరో రెండు చెరువులు నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. పాతబస్తీలోని బమ్సకున్ ఉద్ దౌలా చెరువుతో పాటు.. కూకట్ పల్లిలోని నల్ల చెరువు ప్రారంభానికి సిద్ధమయ్యాయి, ఈ నెల 6వ తేదీన బమ్మకున్ ఉద్ దౌలా చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మరో రెండు మూడు రోజుల్లో కూకట్ పల్లి నల్ల చెరువును కూడా సీఎం నగర ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. హైడ్రా మొదట విడత చేపట్టిన 6 చెరువుల్లో ఇప్పటికే అంబ రేపేటలోని బతుకమ్మ కుంట గతేడాది సెప్టెంబరు 28న ప్రారంభమైన విషయం తెలిసిందే.. మరో మూడు చెరువులు నిర్మాణ దశలో ఉన్నాయి.

Read also: Chittoor Crime: రూ. 2 లక్షల కోసం స్నేహితుడి హత్య

Hyderabad: Two more ponds ready for opening

వీటికి తోడు రెండో విడత మరో 14 చెరువులను హైడ్రా అభివృద్ధి చేయడానికి కసరత్తు చేస్తోంది. ఇలా నగరంలో మురికి కూపాలుగా మారిన చెరువుల రూపురేఖలు మార్చే పనిలో హైడ్రా నిమగ్న మైంది. ముఖ్యంగా పాతబస్తీలో నిజాంల నాటి చారిత్రక చెరువుకు హైడ్రా ప్రాణం పోసింది. కబ్జా లను తొలగించి ఊపిరిలూదింది. అక్రమణలతో ఆనవాళ్లే కోల్పోయిన చెరువును బతికించింది. చరిత్రను తవ్వితీసిన మాదిరి చెరువును రూపొందించి చారిత్రక వైభవాన్ని చాటింది. ఒకవైపు ఉన్న నాటి కట్టను మరింత పటిష్టం చేసి వాకింగ్ ట్రాక్ను హైడ్రా నిర్మించింది. కట్టపై ఓపెన్ జిము పెట్టి అన్ని వయసులవారి ఆరోగ్యానికి బాటలు వేసింది. చెరువు లోపలి వైపు ఫెన్సింగ్ పనులను పూర్తి చేసింది. చిన్నారులు ఆడుకునేందుకు ఇరువైపులా ప్లే ఏరియాలను అభివృద్ధి చేశారు. వృద్ధులు సేద దీరే విధంగా అక్కడ గజ బోలు నలువైపులా నిర్మించారు. చెరువుకు మూడు వైపులా ప్రవేశ మార్గాలను అందుబాటులోకి తెచ్చారు. నిజాంల కాలంలో ఈ చెరువుకు ఎంతో చరిత్ర ఉందని.. దానిని పునరావృతం చేసేలా.. చుట్టూ ఔషధగుణాలున్న మొక్కలతో పాటు.. చల్లటి నీడనిచ్చే చెట్లను నాటారు. సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేసి.. హైడ్రా ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు.

Hyderabad: చెరువు చుట్టూ చరిత్ర..

అడుగడుగునా చారిత్రక ఆనవాళ్లు, ఎన్నో విశేషాలు స్థానికంగా ఉన్న వృద్ధులు పలు విధాలుగా వివరిస్తున్నారు. రాజేంద్రనగర్, ఆరాంఘర్, కాటే దాన్ ప్రాంతాల నుంచి వచ్చే వరద ఈ చెరువుకు చేరేదని చెబుతున్నారు. నిజాంల కాలంలో మీరా లం ట్యాంక్ను రాజులు, బమృకున్ ఉద్ దౌలా చెరువును రాణులు స్నానాలకు వినియోగించేవార ని చెబుతున్నారు. అలాగే బమ్మకున్ ఉద్ దౌలా చెరువులో వనమూలికల చెట్లు, కొమ్మలు వేసి.. ఆ దిగువున నిర్మించిన బావిలోకి వచ్చిన ఊట నీటిని తాగేందుకు నిజాం పాలకులు వినియో గించేవారని మరి కొంతమంది వివరిస్తున్నారు. ఔషధగుణాలున్న ఈ నీటిని మాత్రమే నిజాంలు వినియోగించేవారంటున్నారు. అంతే కాదు.. ఈ చెరువు చుట్టు సువాసనలు వెదజల్లే పూల మొక్క లు విరివిగా ఉండేవని.. ఆ పూలన్నీ చెరువులో పడడంతో ఇక్కడి నీటిని సెంటు తయారీకి విని యోగించేవారని.. ఇందుకోసం అరబ్ దేశాలకు ఇక్కడి నీరు తీసుకెళ్లేవారంటున్నారు. ఇలా ఎం తో చరిత్ర ఉన్న ఈ చెరువు మళ్లీ పునరు

ప్రారంభానికి సిద్ధమైన నల్లచెరువు

ద్ధరణకు నోచుకోవడం చాలా ఆనందంగా ఉందని పలువురు సంబర పడుతున్నారు.
కూకట్పల్లి నల్లచెరువు వరద నీరు ఎటు వెళ్లాలో తెలియని నిర్మాణాలు. కాంక్రీట్ జంగిల్ మారిన ప్రాంతంలో కూకట్ పల్లి నల్లచెరువు ఆక్రమణలకు గురై బిక్కుబిక్కు మంటున్న తరుణంలో హైడ్రా దృష్టి ఆ చెరువుపై పడింది. మురుగు నీటితో దుర్గంధభరితంగా మా రిన ఈ చెరువును అభివృద్ధి చేయాలని హైడ్రా నిర్ణయించింది. 2024 సెప్టెంబరులో ఆక్రమణ లు తొలగించినప్పుడు ఎన్నో అవరోధాలు ఎదుర య్యాయి. రెవెన్యూ, గ్రామ రికార్డులు, చెరువుకు సంబంధించిన సమాచారంతో ఆక్రమణలను తొలగించే పనిని హైడ్రా చేపట్టింది. చెరువులోకి జరిగి ఎన్టీఎల్ పరిధిలో నిర్మించిన 16 వ్యాపా ర షెడ్డులను హైడ్రా తొలగించింది. చెరువులో పోసిన నిర్మాణ వ్యర్థాలతో పాటు దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికను పూర్తిగా తొలగించడమే కాకుండా.. 3 మీటర్లకు పైగా మట్టిని కూడా తొలగించింది. అప్పుడు కాని దుర్గంధం దూరమ వ్వలేదు. ఇప్పుడు చెరువు విస్తీర్ణం దాదాపు రెట్టిం పు అయ్యింది. 16 ఎకరాలకు కుంచించుకుపో యిన చెరువు 30 ఎకరాలకు విస్తరించుకుంది.. కూకట్పల్లి నల్లచెరువును హైడ్రా అభివృద్ధి చేసిన తర్వాత అక్కడి పరిసరాలు ఆహ్లాదంగా మారాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Bam-Rukn-ud-Dowla Lake CM Revanth Reddy Hyderabad Lakes Restoration hydraa Kukatpally Nalla Cheruvu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.