Hyderabad : రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోరెన్సిక్ ల్యాబ్ (FSL) అగ్ని ప్రమాదంపై థర్డ్ పార్టీ విచారణకు సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ (సిఎఫ్ఎస్ఎల్), పూణేలోని ఫైర్ సేఫ్టీ అకాడమి నిపుణులు మంగళవారం రంగంలో దిగారు. ఇందులో సిఎఫ్ఎస్ఎల్ నిపుణుల బృందం హైదరాబాద్కు చెందిన వారు కాగా పుణేలోని ఫైర్ సేఫ్టీ అకాడమి నిపుణులు మహారాష్ట్ర నుంచి వచ్చారు. వీరికి రాష్ట్ర ఎఫ్ఎస్ఎల్ నిపుణులతో పాటు రాష్ట్ర ఎఫ్ఎస్ఎల్, ఫైర్ సేఫ్టీ అధికారులు కేసు విచారణలో సహకరిస్తారు.
Read Also: TG Municipal Elections: రూ.5 లక్షల నగదు సీజ్!
పోలీసులు కేసు నమోదు
ఈ దుర్ఘటనపై ఇప్పటికే నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తుండడం తెలిసిందే. దీంతో పాటు అగ్ని ప్రమాదం పై ఫైర్ సేఫ్టీ విభాగం అధికారులు వేరుగా విచారిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం లో కీలకమైన ఓటుకు నోటు కేసుతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన రికార్డులు కాలిపోయాయని, దీని వెనుక కుట్ర వుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనిపై థర్డ్ పార్టీ విచారణకు పోలీసు శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా సిఎఫ్ఎస్ఎల్, పూణేలోని ఫైర్ సేఫ్టీ అకాడమి నిపుణులు సొంతంగా విచారణ చేబట్టారు.
ఈ రెండు విభాగాల అధికారులు మంగళవారం సాయంత్రం ప్రమాదం జరిగిన ఎఫ్ఎస్ఎల్ మొదటి అంతస్తును పరిశీలించారు. ఇక్కడ కాలిపోయిన రికార్డులను కూడా వారు పరిశీలించారు. ఇందులోని సమాచారాన్ని తిరిగి పునరుద్దరించేందుకు తీసుకుంటున్న చర్యలను వారు ఇక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిఎఫ్ఎస్ఎల్, పూణేలోని ఫైర్ సేఫ్టీ అకాడమి నిపుణులు విచారణ రెండు మూడు రోజుల పాటు సాగే వీలుందని తెలిసింది. అనంతరం వారు దీనిపై పోలీసు శాఖకు వేరు వేరుగా నివేదిక ఇచ్చే వీలుంది.
Read hindi news: hindi.vaartha.com
E paper : epaper.vaartha.com
Read Also: